Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

233


ఉద్యోగులు నిట్లు నియమింపబడుచునేయుండిరి. ఇందువలన కంపెనీవారు లాభముపొందుచుండిరి. భారతదేశములో కంపెనీ రాజ్యభాగములందలి కంపెని ప్రభుత్వములకు అచ్చటి ప్రజలపైన పన్నులు విధించుట కధికారమొసగబడెను. దీనినిగూర్చి సుప్రీము కోర్టువారుకూడా అధికారము కలిగియుందురు. పన్నులివ్వనిచో శిక్షింపవచ్చును. అధికారము స్వదేశ రాజులవల్ల కంపెనీకి సంక్రమించిన అధికారమునకు అదనముగా నివ్వబడిన అధికారము. గౌరవ న్యాయాధిపతులకు, ఐరోపావారు దేశవాసులపైన జరిగించు దౌర్జన్యపునేరములు అక్రమప్రవేశ నేరములు విచారించు అధికార మివ్వబడెను.

భారతదేశమునకు క్రైస్తవ మిషనరీలుగా వచ్చువారు లైసెన్సు పొందవలెనని విధింపబడెను. ఇదివరకువలెగాక మొదటిసారి భారతదేశ ప్రజల విజ్ఞానాభివృద్ధికని చెప్పి లక్ష రూపాయిలు ప్రత్యేకించి యుంచి దానిని సారస్వత విజ్ఞానమునకు శాస్త్రవిజ్ఞానమునకు వినియోగింపవలెనని శాసింపబడెను. ఈసంస్కరణము ఆ రోజులలో విశేష కృపిచేసిన రాజా రామమోహనరాయలవలన జరిగినదని చెప్పకతప్పదు. 1814 లో బ్రిటీషు ప్రజలపైన విదేశములపైన ఇతరులపైన సుంకములు విధించుటకు అధికారమిచ్చు చట్టముచేసిరి. 1823లో బ్రిటీషు సైనికుల పించనులక్రింద 60 వేల పౌనులు మన దేశాదాయముపైన బద్దతచేసిరి. క్రైస్తవమతశాఖవారి జీతములు మనపైన బడవేసిరి. న్యాయవిచారణ శాఖవారి జీతములు నిర్ణయింపబడెను.