పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


రచు నిబంధనలకు లోబడి ఇతరు లిట్లు ఓడ వ్యాపారము చేయవచ్చునని 1813 లో శాసింపబడెను.

IV

1813 సం|| కంపెనీ సన్నదుచట్టము.

కంపెనీవారి భారత రాజ్యభాగములను వారు వసూలు చేయుచున్న దేశాదాయములను వారి కెప్పటివలెనే యింకను 20 సంవత్సరములదాకా భుక్తపడునట్లు పార్లమెంటువారు నిర్ణయించిరి. భారతదేశముపైన కంపెనీవారి పాలనముపైన బ్రిటిషురాజులకుగల రాజ్యాధికారములు స్పష్టీకరింపబడెను. కంపెనీవారి వ్యాపార వ్యవహారములకును వీరి పాలన వ్యవహారములకును వేరువేరుగా లెఖ్కలుంచవలెనని శాసింపబడెను. ఈ లెక్కలు “బోర్డు ఆఫ్ కంట్రోలు" వారి తనిఖీక్రింద నుండవలెను. భారతదేశ ఆదాయములనుండి ఇంగ్లీషు ప్రభుత్వమువారు లాభముపొంచు తలంపుకలిగి అట్లు బహిరంగముగా సొమ్ము పుచ్చుకొనుట కిష్టములేక, ఇంగ్లాండు ప్రభుత్వము పంపు సైన్యములను కంపెనీవారే భరింపవలెనను విధానము స్థిరపరుపబడెను. ఈ విధానము ప్రకారము రెండులక్షల సైన్యమువరకు అట్లు పంపవచ్చుననియు శాసింపబడెను. కంపెనీవారు భారతదేశ పరిపాలనకొరకు చేసిన ఋణమును తగ్గింపవలెననిరి. కంపెనీ లాభములు నూటికి 10 1/2 కన్న మించకూడదనిరి. భారతదేశములోని అన్ని ఉద్యోగములకు అభ్యర్ధులను నియమించు అధికార ప్రాపకములు ఎప్పటివలెనే కంపెనీ డైరెక్టర్ల కే నిలువబడెను. గవర్నరుజనరలు, సర్వసేనాని, ఇతర