Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

231


ఇంతలో కంపెనీవారి సన్నదు మంజూరు చేయవలసిన తరుణము రాగా కంపెనీ వ్యవహారములనుగూర్చిన విచారణయు విమర్శయు జరిగెను. ఏలయన గవర్నరుజసరలు వెల్లస్లీచేసిన రాజ్యాక్రమణ వలన చాలసొమ్ము ఖర్చుపడి కంపెనీవారికి ధనసహాయము కావలసి ఋణముచేయుటకు ఇంగ్లీషు పార్లమెంటువారిని అనుమతి నడిగిరి. కంపెనీ పరిపాలనను గూర్చి చాల అసంతృప్తి బయలుదేరెను. వీరి పద్దతులనుగూర్చి అనేక ఫిర్యాదులు వచ్చియుండెను. అంతట 1808 లో పార్లమెంటువా రొకవిచారణ కమిటీ నేర్పాటుచేయగా వారు 1812 లో "ఫిప్తు" రిపోర్టు (Fifth report) అనబడు నివేదికను తయారుచేసిరి. భారతదేశములోని న్యాయవిచారణ పోలీసు శాఖలనుగూర్చియు భూస్వామిత్వమును గూర్చియు ఈనివేదికలో విపులముగా చర్చింపబడెను. కంపెనీవారివేగాక ఇతరుల ఓడలనుగూడ భారతదేశమునకు పోనిచ్చుటకు పార్లమెంటువారు అంగీకరింపవలెనను ప్రచారము చేయబడెను. కంపెనీవారు తాము పరిపాలకులై రాజకీయాధికారములను గలిగియున్నను వ్యాపారలాభములు పోయినచో తాము బ్రతుకజాలమని మొరబెట్టుకొనిరి గాని లాభము లేకపోయెను. తమ అధికారమునకు లోబడనివారు దేశములోనికి వచ్చినచో అందువలన కలుగు చిక్కులకు తాము బాధ్యత వహింపలేమనిరి. మరియు అట్టివారివలన భారతీయుల క్షేమమునకు భంగము కలుగుననిరి. ఇంక నెన్నోసాకులు చెప్పిరి. ఇందులకు ఫలిత మేమనగా ఆయా ప్రెసిడెన్సీల స్థానిక ప్రభుత్వములవలన లైసెన్సులుపొంది వా రేర్ప