Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఇంగ్లీషు బారిస్టర్లను న్యాయమూర్తులను ఆంగ్ల నృపాలుడు నియమించునట్లు ఏర్పాటు చేయబడెను. ఆకోర్టుకు దేశములోని అన్నిసివిలు క్రిమినలు అడ్మిరాలిటీ మతవ్యవహారములను గూర్చినకేసులు, విచారించు అధికార మొసగబడెను. దానిక్రింద పనిచేయు ఉద్యోగులను గూర్చిన నిబంధనలు చేయుట కధికార మొసగబడెను. 1774 మొదలు కంపెనీ పరిపాలన కొలువులో చేరిన ప్రభుత్వనౌఖరులు స్వంతలాభముకొరకు ఏ నెపమునగాని ఎట్టిబహుమతిని విరాళమును దానమునుగాని ఏరూపముగగాని ఎట్టి లంచములును పుచ్చుకొనరాదని శాసింపబడెను. ఇంగ్లీషు పార్లమెంటువారి అధికారమునకు లోబడి గవర్నరుజనరలు కార్యాలోచన సభకు, కంపెని రాజ్యమున సత్పరిపాలనకు వలసిన నిబంధనలను రిగ్యులేషనులను ఆర్డినెన్సులను చేయుట కధికారమీయబడెను. ఇవి సుప్రీముకోర్టువారివలన రిజస్టరు చేయబడి ప్రకటించినగాని అమలు జరుగవు. వీనినిగూర్చి ఇంగ్లాండులో ఎవరైనను ఈ ప్రభుత్వచర్యలనుగూర్చి అప్పీలు చేసినచో అవి విమర్శించబడి లోపములు సవరించబడును.

రిగ్యులేటింగు ఆక్టు వలస బంగాళాగవర్నరే ఇండియా గవర్నరు జనరలుగా చేయబడి బొంబాయి మదరాసు గవర్నరులకు పైయధికారిగా చేయబడెను. వారతని సమ్మతి లేనిదే యుద్ధములుగాని సంధిగాని చేయకూడదు. గవర్నరు జనరలుకు సహాయము చేయుటకు నలుగురు సభ్యులుగల సుప్రీముకౌన్సిలు అను కార్యాలోచనసభ యేర్పాటుచేయబడెను. మెజారిటీ అభిప్రాయము ప్రకారము గవర్నరుజనరలు