Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

225


జనరలు, నలుగురు కార్యాలోచన సభ్యులునియమింపబడునట్లును ఆ రాజధానిపరిపాలన, పన్నులవసూలు, అందలి సివిలుపరిపాలన సైనిక వ్యవహారములు, జరుపుటకును, ఆ రాష్ట్రమునందేగాక బీహారు ఒరిస్సాలందునుగూడ అధికారము గల్గియుండుటకును ఏర్పాటు గావింపబడెను. మఱియు నీ గవర్నరుజనరలు ప్రభుత్వమునకు మద్రాసు బొంబాయి రాజధానులలోని కంపెనీవారి కౌన్సిలు ప్రెసిడెంటుల పరిపాలనలపైన పై తనిఖీ అధికారము లివ్వబడెను.

మొట్టమొదట ఈగవర్నరుజనరలును సభ్యులను కంపెనీ డైరెక్టర్ల సలహాతో ఇంగ్లండురాజే నియమించును. వీరిని తొలగించుటకు ఆ రాజుకేఅధికార మీయబడెను. ఈగవర్నరు జనరలును కార్యాలోచన సభ్యులు కంపెనీ డైరక్టర్లక్రింద పని చేయవలెను. ఆ డైరక్టర్లు ఇంగ్లండునుండి పంపు తాకీదులను వీరు శిరసావహింపవలెను. డైరెక్టర్లకు వీ రెప్పటి కప్పుడు సంగతులు వ్రాయుచుండవలెను. ఈ కంపెనీ డైరక్టర్లు భారతదేశ ప్రభుత్వమునజరుపు అన్ని చర్యలకు వ్యవహారములకు వ్రాతమూలపు రికార్డునువ్రాసి అట్టి 'మినిట్సు' యొక్క ప్రతిని ఇంగ్లీషు ప్రభుత్వమున కీయవలెను. అదివరకు ఇంగ్లండురాజు ఇచ్చిన సన్నదులోనే కంపెనీవారి రాజ్యములలో సివిలు క్రిమినలు తగవులను విచారించుటకు ఒక కోర్టు నెలకొల్పబడుట కధికారముండెను. రెగ్యులేటింగుఆక్టువలన వంగరాష్ట్రమున కలకత్తాఫోర్టువిలియం కోటలో ఇంగ్లీషురాజు అధికారముక్రింద నొక పరమోన్నతన్యాయస్థానము (సుప్రీముకోర్టు) ను స్థాపించి