Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


రెగ్యులేటింగు ఆక్టు

1772 అక్టోబరు - నవంబరు నెల నాటికి కంపెనీ దివాలా స్థితిలోనికివచ్చెను. ఆనాడు ఇంగ్లాండు ప్రభుత్వప్రధానమంత్రి నార్తుప్రభువు కంపెనీకి ఋణ మిప్పించెద ననియు ఇందుకు ప్రతిఫలముగా తానొక క్రొత్తచట్టము ప్రకారము కలకత్తాలో నిర్మించు కార్యనిర్వాహక సంఘముయొక్క సర్వాధికారమునకు ఆ నా డిండియాలో కంపెనీవారికి వివిధ రాజధాను లందుగల 'ప్రెసిడెన్సీ కౌన్సిళ్లు'ను పరిపాలనలును లోబడవలెననియు ఇండియాలోని రాజకీయ సివిలు మిలిటరీ పరిపాలనలయొక్క అధికారుల నింగ్లాండు ప్రభుత్వమువారే నియమింతురనియు దానిఖర్చులు కంపెనీ భరించుట కంగీకరింపవలెననియు చెప్పెను. కంపెనీవారి ఆంతరంగిక వ్యవహార విధానములో కూడా కొన్ని క్రొత్తనిబంధన లేర్పరచిరి. వేయిపౌనుల వాటాదార్లే డైరెక్టర్ల నెన్నుకొనవలెననెను. దీనికి కొందరు వాటాదార్లు ప్రతిఘటించిరి కాని తుదకా సలహా ప్రకారము జరిగెను. ఇండియా వ్యవహారములను జూచుచుండుట కొక “సీక్రెట్ కమిటి" ( రహస్యఉపసంఘము ) ఏర్పాటు గావింపబడెను.

1773 లో కంపెనీ వారికి రాజ్యాధికారము లిచ్చుచు పార్లమెంటువారొక చట్టముజేసిరి, దీని కే “ రెగ్యులేటింగు ఆక్టు" అని పేరు. ఇదివరకు కంపెనీవారేర్పరచిన కౌన్సిలు ప్రెసిడెంటులు, గవర్నరులే, ఈ దేశమున అధికారము కల్గియుండిరి. ఈచట్టమువలన వంగరాష్ట్రమును పాలించుటకు ఒక గవర్నరు