Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

227


నడువవలెను. ఈ రెగ్యులేటింగు ఆక్టు ప్రకారమే భారతదేశ పరిపాలన కొంతకాలము నడిచినది.

1784 వ వంవత్సరమున తూర్పు ఇండియా కంపెనీ చట్టము అను శాసనముచేయబడి భారతదేశమున నింగ్లీషు ప్రభుత్వమును స్థిరపరచుటకు బందోబస్తులను కట్టుదిట్టములను చేసినది. తూర్పు ఇండియా సంఘముయొక్క వ్యవహారముల క్రమ నిర్వహణము కొరకును అవి చక్కగా జరుగ గలందులకును, భారతదేశములోని "బిటిష్" రాజ్యములయొక్క వ్యవహారములక్రమ నిర్వహణమును జక్కపరచుటకును, తూర్పు ఇండియా రాజ్యములందు నేరములు చేయువారిని విచారణ చేయుటకు కోర్టు ఆఫ్ జూడికేచరును నిర్మించుటకును ఈ చట్టమును పార్లిమెంటువారు శాసించినట్లు దాని పీఠికలోనే వివరింపబడియున్నది. భారతదేశ వ్యవహారములను కనిపెట్టి చూచుటకు ఆరుమంది కమిషనర్లను నియమించుటకు అందులో ఇంగ్లాండుమంత్రులలో నిరువురుండునట్లును ఇట్లు నియమింపబడిన కమిషనర్లలో ముగ్గురకు తక్కువగాకుండ ఒక బోర్డుగా ఏర్పడి భారతదేశ పరిపాలనలో కంపెనీ వ్యవహారముల నన్నిటిని తనిఖీచేయుచు దానిని నడుపుచు సర్వాధికారములు చలాయించవచ్చుననియు శాసింపబడెను. దీనికే 'బోర్డు ఆఫ్ కంట్రోలు' అని పేరువచ్చినది. ఈ చట్టమును శాసించునాటి కింగ్లాండు ప్రధాని పిట్టు. అందువల్ల దీనికి “పిట్టుచట్టమని"యు పేరువచ్చినది. భారతదేశములోని ప్రభుత్వమునందు కొన్నిమార్పులు చేయబడెను. గవర్నరు జనరలుకు సహాయము చేయుటకు