214
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
వెలయింపజేసెను. పూర్వమునాటినుండియు కంపెనీవారి ప్రభుత్వాచార వ్యవహారములలో రాజరికమునకు విరుద్ధములును వర్తకసంఘచిహ్నములును అగు వ్రాతకోతలునుమరియాదలును వ్యవహారవిధానములును ఇంకను నిలిచియుండెను. అవియన్నియు నీతడు మాన్పించి బ్రిటిషు రాజ్యతంత్రముయొక్క ప్రధాన పద్ధతులలో ముఖ్యమైన పరిపాలనా శాఖల విభజనమును అతి నేర్పుతో చేసే నేటిప్రభుత్వ ఉద్యోగవర్గ ఉక్కు చట్రమునకు పునాదులు వేసెను. రైతులకు రాకపోకల సౌకర్యములకు గ్రామములకు రోడ్లు, పొలములకు నీటివసతులు, వృద్ధిచేయుట యత్యవసరమై యుండగా కేవలము సైనిక సదుపాయముల కొరకే నిర్మింపబడి ఆ నిర్మాణముల వలన ఆంగ్లేయుల కమిత లాభము కలిగినట్లీటీవల అర్థశాస్త్రజ్ఞులు నిర్ణయించిన రైళ్ళను , నిర్మించుట కీతడు దారిచూపి మొదటిరైలుదారిని నిర్మింపజేసినాడు. తంతి తపాలాపద్దతికూడ నెలకొల్పినాడు. 1854 లో విద్యావిధానమును గూర్చి ఒక ప్రణాళికతయారుచేయబడెను. జిల్లాలలో పాఠశాలలు నెలకొల్పబడెను. విశ్వవిద్యాలయస్థాపన చేయుట కాలోచించిరి.
గ్రుడ్డిలో మెల్లయనునట్లు ఈ నిరంకుశయుగమున ఒక్క లాభము మాత్రము ప్రజలకు కలిగి రాజకీయ పరిజ్ఞానము వృద్ధియగుటకును ప్రజాభిప్రాయము వర్ధిల్లుటకును అందువలన ప్రజలు తమ హక్కులకొర కాందోళనచేయుటకును కారణమైనది. బెంటింకుకును ఆతని తరువాత వచ్చిన ఆక్లెండుకును మధ్య కొన్నాళ్లు గవర్నరుజనరలుగా ఆక్టింగుచేసిన మెట్‌కాఫ్