రాజ్యాంగ నిర్మాణము
215
దేశములోని ముద్రాలయములపైన వార్తాపత్రికలపైన అంతవరకుండిన కఠిన నిరోధక నిర్బంధములను తీసివేసెను. అంతవరకును వార్తాపత్రిక నిర్వహణము కేవలము ఆంగ్లేయుల చేతిలోనే కలకత్తాలో నుండెను. భారతీయుల కందు తావులేదు. బెంటింకుమాత్రము కొంచెము ప్రోత్సాహ మొసగెను. మెట్ కాఫ్ చేసిన ఉపకారమువల్ల దేశములో భారతీయ విద్యాధికులు మెల్ల మెల్లగా పత్రికా నిర్వహణమునకు పూనుకొని ప్రజాభిప్రాయమును రాజకీయ పరిజ్ఞానమును వృద్ధిజేసి దేశమునకు తోడ్పడసాగిరి. విద్య యభివృద్ధి జెందుటవలనను పత్రికలు స్థాపించబడుటవలనను అంతవరకు స్తంభీభూతమై పోయియున్న ప్రజాభిప్రాయ మొక్కమారుగా వెలికివచ్చెను. ఆనాడు క్రైస్తవమత బోధకులు హిందువులను తమ మతములో కలుపుకొనుటకుచేయుచున్న దుష్ప్రయత్నములను గూర్చి తీవ్రమైన సంచలనమును ఆందోళనమును కలిగి స్వదేశసంఘములు స్థాపింపబడి దేశోద్ధరణ ప్రయత్నములకు మార్గము లేర్పడెను.
ఆరవ ప్రకరణము
రాజ్యాంగ నిర్మాణము
I
ఇంగ్లీషురాణియగు ఎలిజబెత్తు తూర్పుఇండియా వర్తకసంఘమువారికి 1600 సంవత్సరమున నిచ్చిన సన్నదు లేక పట్టా ఆకంపెనీవారు భారతదేశమున వ్యాపారము చేయుటకు