ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము
213
కాని డైరెక్టరుల కోర్టువారు వడవడ వడకిపోయిరి. ఆరునెలలు మాటలుజరిపి తుద కా గాజులు తొడుగుకొనినవారి నేల భయపెట్టవలెనని యూరకుంటిని. "
18 వ ఆగష్టు 1853:
“అయోధ్యరాజు కొంచెము పెంకితనము చూపునట్లున్నాడు. చూపవలెననియే నా కోరిక. నేను పోవులోపల వానిని కబళించుట నాకు తృప్తిని కలిగించును. ముసలి ఢిల్లీ రాజు చచ్చుచున్నాడు. డైరెక్టర్ల కోర్టువారు భయపడనియెడల వానితో తైమూరువంశము నంతమొందించి యుందును. ”
22 వ అక్టోబరు 1854:
"రాణులతోను, రాజులతోను విందులారగించిన పిదప, ధులీప్‌సింగు, గవర్నరుజనరలు గదిముందు పాదరక్షలు విడిచి లోనికివచ్చుట కిచ్చగించునని నేనుతలంపను. అయినను అతడు పాదరక్షలు విడుచునట్లు చేసితీరెదను.”
22 వ జూలై 1855;
".........మన బ్రిటీషువారు వింతవస్తువుల కోసమను నెపమున బొరియలుపెట్టి నవరత్నములను లాగని దేవాలయమే లేదు. ఒకమారు నేను రంగూనులో నట్టి వింతవస్తువులు కొనియుండుటవలన నీ యన్యాయములో నాకును పాలున్నదని తోచుచున్నది."
2 వ డిశంబరు 1857 - లేఖకు 130 వ ఫుటచూడుడు.
డల్‌హౌసీ భారతీయులను ఇంగ్లీషువారిని బులిపింపగల రాజకీయసంస్కరణములు నాగరకతాచిహ్నములు కొన్ని