210
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
VII
డల్‌హౌసీ తన స్నేహితులకు వ్రాసినలేఖలను[1] బట్టి యాతని కాలమునాటి స్థితిగతులును బ్రిటిషు రాజ్యతంత్రమును కొంత బయల్పడుచున్నవి.
18 వ సెప్టెంబరు 1848 :
"నే నిచ్చట దర్జాగా కూర్చుని రాళ్ళురువ్వినట్లు రాజులను, రాజ్యములను ఇటునటు గిరవాటు వేయుచుండుట చూడగా నాకే నవ్వువచ్చుచుండును. నీవు నాశ్చర్యపడుదువు. నవ్యువచ్చుచున్నను ఇది కష్టమగు పనియే సుమీ" అని డల్‌హౌసీ వ్రాసెను. ఇప్పటికి ఆతడు గవర్నరుజనరలై సంవత్సరము తిరుగలేదు!
7 వ మార్చి 1849 :
“ఇప్పుడు వ్యవహారము కొంత బాగున్నది. ఒక స్నేహితుడు నన్నుచూచి 'నీవును రష్యాదేశపు చక్రవర్తియుమాత్రమే ప్రస్తుత కాలమున నిర్భయులగు నిరంకుశ పాలకు'లని వ్రాసిన సంగతి వాస్తమేయని నాకిప్పుడు స్ఫురించుచున్నది."
30 వ మార్చి 1849:
"చేప నా వలలో పడినది. (సిక్కు) మహరాజు బ్రిటిషు అధికారమునకు లొంగి పత్రమును వ్రాసినాడు. కోహినూరు వజ్రమును మన రాణి కిచ్చి వైచినాడు. పంజాబులో ప్రతి యంగుళమును బ్రిటీషు పరగణాగా ప్రకటింపబడినది. ఈ రాజ్య
- ↑ Private letters of Marquess of Dalhousie. -J. G. A Baird.