ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము
211
నీతియొక్క యావశ్యకతనుగూర్చి నే నారునెలల క్రిందటనే మన యధికారవర్గమువారికి వ్రాసియున్నాను. వారు సరియైన జవాబు నీయలేదు. నేను నా బుద్ధిపూర్వకముగనే ఇట్లు చేసితిని. వారి పరిపాలసమునందలి యుద్యోగి బ్రిటిషు సామ్రాజ్యమునకు నలుబది లక్షల ప్రజలను కలిసి మొగలు సామ్రాజ్యపు దివ్యరత్నమును తన రాణి కివ్వగలుగు అవకాశము ప్రతి దినము దొరకదు. ఇది నేను చేసితిని."
5 వ అక్టోబరు 1849:
చత్తర్ సింగును షర్‌సింగును సిక్కు పాలకులు. వా రనుదినము నూర్వురు బాహ్మణులకు భోజనము లిడుచుండిరి.. వారి నరెస్టుచేసి ఇతడు , " ఈ బాహ్మణులు కుతంత్రములకు, రాజద్రోహ తంత్రములకు సుప్రసిద్ధులు,” అని వ్రాసెను.
15 వ డిశంబరు 1849 :
తనకు లాహోరులో జరిగిన స్వాగత మహోత్సవమునుగూర్చి యిట్లు వ్రాసెను: “ ... లెక్కకుమీరినగుంపులు చేరిరి. నేనెచ్చటికి పోయినను సలాములు మిన్ను ముట్టుచుండెను. ఇది మన పరిపాలసము పట్ల ప్రజలకుఁ గల ప్రీతిని తెలుపునని తలంచునంతటి మూర్ఖుడనుగాను. కాని వారు లోబడిరనియు, వారు బాగుగా భయపడినారనియు, మనకు హస్తగతులైనారనియు మాత్రమిది తెలుపుచున్నది.”
4 వ ఆగష్టు 1850:
"......యుద్దముముగిసిన పదునెనిమిది మాసములలో మన పరిపాలనకు వ్యతిరేకుడగు ప్రతిసిక్కును పనిపట్టించితిని.