206
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
గల యుద్యోగులకు హెచ్చు న్యాయవిచారణాధికారముల నిచ్చుచు "సదరమీ౯" అను హోదాగల న్యాయవిచారణాధికారి వర్గమును నిర్మించెను. 1833 వ సంవత్సరమున భారతీయోద్యోగులకు కొంత పరిపాలనాధికారమును (executive), రివిన్యూ అధికారమునుగూడ నొసగుచు డిప్యూటీకలెక్టరును కొత్తహోదాగల యుద్యోగ వర్గమునుకూడా నిర్మించెను. నాటినుండి నేటివరకు క్రమక్రమముగ కొన్ని గొప్ప ఉద్యోగములుకూడా భారతీయులు అతిసమర్థతతో నిర్వహించుటయు కొందరు గవర్నరులుకూడా అగుటయుకూడ తటస్థించిన దీతనిప్రసాదమేయని చెప్పక తప్పదు. అయినను ఆనాడు వీరియుద్దేశము మనకు లాభముకలిగింపవలెనని కాదు. భారతీయులను నియమించినచో వ్యయము తగ్గుననియే., 1822 లో జరిగిన భూమిశిస్తుల నిర్ణయము (Land Settlements) వలన ఉత్తర హిందూస్థానములో భూమిమీదవచ్చు (ఆదాయపు విలువ) కట్టుబడిలో నాల్గింట మూడువంతులు భూమిశిస్తుగా వసూలుచేయుటకు ప్రభుత్వము వారివల్ల నిర్ణయింపబడెను. ఇది మిగులభారముగా నుండెను. అందువలన కట్టుబడిలో 2/3 వంతులు మాత్రమే భూమిశిస్తుగా వసూలు చేయుపద్ధతిని బెంటింకు స్థాపించెను. దానిప్రకారము 1833 లో ఒక సెటిలుమెంటు జరుపబడి ప్రజలకు కొంత సౌకర్యమును కలిగించెను.
నాడు రాజా రామమోహనరాయలు తన అద్వితీయమైన మేధాశక్తిని భారతదేశ క్షేమలాభములకొరకును, సంఘ,