పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

207


సంస్కరణములకొరకును, విజ్ఞానాభివృద్ధికొరకును వినియోగించుచు మహోపన్యాసముల గావించుచు దేశములో ప్రచారముచేయుటయేగాక ఇంగ్లండుకుపోయి భారతదేశప్రజల పక్షమున పనిచేయసాగెను. ఈతడు బెంటింకు ప్రభువునకు మిత్రుడయ్యెను. ఈతని ప్రోత్సాహముతో సహగమనము నిషేధింపబడెను. నాడు దేశమునెల్ల సంక్షుభితముచేసిన “థగ్గు"లను దారిదోపిడిగాండ్రను హత్యగాండ్రను అణచివేయుటకు బెంటింకు చాల పనిచేసెను.

1833 లో కంపెనీవారికి క్రొత్త రాజ్యాధికార పట్టా యివ్వబడుతరుణమున చేయబడిన రాజ్యాంగ చట్టమువలన కొన్ని సంస్కరణములు జరువుట కేర్పాటు గావింపబడెను. ఆచట్టమునుబట్టి భారతదేశమునకు తాను చేయగలిగిన ఉపకారములను బెంటింకు చేసినాడు. దేశములో జరుగుచుండిన వర్తకమునకు కంపెనీ రాజ్యప్రారంభము నుండియు నుంకములు విధించు ఆచారముండెను. అందువలన ప్రజల వర్తకమున కాటంకము కలుగుచుండెను. ఇది ఈ కాలమున నే రద్దుచేయబడెను. ఈ మధ్యకాలములో జరిగిన సంస్కరణములవలన దేశముయొక్క రివిన్యూ ఆదాయములో 1814 మొదలు 1834 వరకు కొన్ని కోట్ల రూపాయలు నష్టము కలిగెను. దానిని పూడ్చుటకు బెంటింకు పరిపాలనలో కొంతపొదుపు చేసెను.

భారతీయోద్యోగులకు సివిలు అధికారములు హెచ్చు చేయుటవలనను ఆంగ్లేయులకు కలకత్తా సుప్రీముకోర్టుకు సివిలు అప్పీళ్ళు చేసుకొనుహక్కు తీసివేయుచు చట్టమొకటి