పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

205


ర్తము ఎన్నడును రాజాలదు." అతడే ఇంకొకలేఖలో నిట్లు వ్రాసెను. “తరుణము కొఱకు వేచియుండి మనకెక్కువ అపాయముగాని ఖర్చుగాని లేకుండగనే అచిరకాలములోనే దక్షిణాపథద్వీపకల్పములో చాలభాగము మన మాక్రమించు కొనవచ్చును. దీనికిగాను మనము మొట్టమొదట టిప్పు సాహిబును కూలద్రోయవలెను." (టారెన్సు పుట 368, 382,) ఇక ఎల్‌ఫి౯స్ట౯ అన్ననో మహారాష్ట్రుల ఆధిపత్యమును నాశనము చేయుటకు జరిగిన కుటిలరాజ్యతంత్ర ప్రయోగము లందును, రాజ్యాక్రమణయుద్ధమందును పాల్గొనిన తరువాత నిత డా దేశమునకే పరిపాలకు డైనాడు.

V

భారతదేశపు ప్రజలుకూడ ఆంగ్లేయులకువలెనే కలెక్టరు జడ్జీ మొదలగు పెద్దయుద్యోగములు చేయుటకర్హులనియు, తగు ప్రోత్సాహమిచ్చినచో అతిసమర్ధతతో తమ దేశపరిపాలనమును నిర్వహింప గలుగుదురనియు ఎల్‌ఫి౯స్ట౯ కంపెనీ డైరెక్టర్లుకు వ్రాసియుండెను. సర్‌తామస్‌మన్రో చనిపోవుటయు ఎల్‌ఫి౯స్ట౯ పదవి చాలించుకొనుటయు ఒకేసంవత్సరమున 1827లో జరిగినదిగాని గ్రుడ్డిలో మెల్లయన్నట్లు వీరివలెనే ఉదార రాజనీతిజ్ఞుడును స్వాతంత్ర్య ప్రియుడునని పేరు పొందిన విలియం బెంటింక్ ఆ సంవత్సరముననే భారతదేశమునకు గవర్నరు జనరలుగా నియమింపబడెను. ఇతడు వారిపద్దతులతోనే పరిపాలింపసాగెను. 1831 వ సంవత్సరమున మున్సబులు సదరమీనుల రెగ్యులేషనుచేసి భారతీయులలో సమర్థత