Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


పెట్టిరి. హేస్టింగ్సు దుబారా ఖర్చుజేసి అప్పులలోబడి వచ్చినాడేగాని అతని కిందుభాగము లేదని అతని స్నేహితులు వాదించిరి. అంతట హేస్టింగ్సును డైరక్టర్లు వెనుకకు రప్పించిరి.

IV

బ్రిటిషు రాజ్యతంత్రముయొక్క ప్రధానోద్దేశము ఈ దేశము నింగ్లాండుదేశ లాభముకొర కుపయోగించుకొనుటయే. అందుకు గావలసిన బందోబస్తులనెల్ల కంపెనీ డైరెక్టర్లు గావించి తమ దేశమునకు పదివేలమైళ్ళ దూరమునగల ఈ దేశమును పాలించుటకు కొందరిని అధికారులుగా నియమించి వారిపైన నాధారపడుచుండిరి. ఈ తాబేదారులిచ్చుసలహా ప్రకారమే కంపెనీ పరిపాలన మంతయు నడుపబడుచుండెను. కాబట్టి ఈ దేశములోని ఆంతరంగిక పరిపాలనలో ప్రజాపీడనము హెచ్చగుటయు తగ్గుచుండుటయు ఆ యా కాలములనాటి గవర్నరు జనరలు మొదలు క్రిందివరకుగల తాబేదారుల మంచి తనముపైనను చెడ్డతనముపైనను ఆధారపడియుండెను. క్లైవు వార౯ హేస్టింగ్సులకును, కార౯ వాలీసు బెంటింకులకును, గల తారతమ్యమే డల్‌హౌసీ రిప్పనులకును, కర్జనువిల్లింగ్డనులకును, ఇర్వి౯ లి౯లిత్గోలకును గలదు. నిరంకుశత్వములో కుడి ఎడమ, ప్రజాపరిపాలనలో విచక్షణ, ప్రజాసౌకర్యములందు వృద్దిక్షీణములు, విజ్ఞాన వికాసమునందు పెరుగుతరుగులు, ప్రజల హక్కులందు ఎదుగుబొదుగులును ఈ తారతమ్యమునందే యిమిడియున్న వని ఆంగ్ల రాజ్యస్థాపననుండి నేటివరకు ప్రయో