Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

201


అంతట గ్రుడ్డిరాజు హత్యచేయబడెను. ఇది యంతయు నొక కుట్రయొక్క ఫలితమని ప్రజలకు తోచినది. ఈ సంధివలన అప్పాసాహేబు అత్యధికమగు సొమ్ము బిటిషువారి కివ్వవలసివచ్చెను. సాలుకు 30లక్ష లిచ్చుకోవలసివచ్చి అతడు బాధపడెను. తరువాత అప్పాసాహెబు బాధలు భరింపలేక రాజ్యమును త్యజించినాడు. అతనిని ఇంగ్లీషువారు చెఱపెట్టిరి. హేస్టింగ్సుయొక్క మహారాష్ట్ర యుద్దమువలన నితని కనేక వేల పౌనులు లాభముకలిగినది. మహారాష్ట్రయుద్దమందు జయించినందు కితినికి బహుమానముగా కంపెనీవారు 60 వేల పౌనులిచ్చిరి. కంపెనీవారికి 50 వేల చతురవు మైళ్ళ భారతదేశము, మధ్యరాష్ట్రములు లభించినవి. హేస్టింగ్సు ప్రజల కెట్టి లాభమును చేయలేదు, సరికదా దిగుమతులపైన సుంకములు తగ్గించి భారతదేశ పరిశ్రమల నితడు నాశనముచేసినాడు. మద్రాసులో రైత్వారీపద్దతి కనుజ్ఞనిచ్చి రైతులను దరిద్రులుగా జేసినాడు. అనేక న్వదేశరాజులచేత సంధిపత్రములువ్రాయించి వారి స్వాతంత్య్రమును నాశనము చేసినాడు.

హేస్టింగ్సుచేసిన నాల్గు గొప్ప యుద్ధములకు చాల సొమ్ము కావలసివచ్చెను. దీనికి అయోధ్య వజీరుదగ్గఱ నితడు అప్పుచేసెను. హామీక్రింద గూర్ఖాలదగ్గఱనుండి లాగిన జిల్లా నతనికిచ్చెను. హేస్టింగ్సు పాలకపుత్రిక భర్త హైదరాబాదులో పామరు కంపెనీలో భాగస్థుడు. నైజాముకు పెద్దవడ్డీకి ఋణ మిప్పించి లాభము పొందినాడు. ఈ వ్యవహారములోని అన్యాయములు బయల్పడగా డైరెక్టర్లు హేస్టింగ్సును చీవాట్లు