ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము
203
గింపబడిన బ్రిటిషురాజ్యతంత్రమునందు చేయబడిన పరిపాలనా విధానమునందు స్పష్టముగా గనబడుచున్నది.
భారత దేశమున బ్రిటిష్ పరిపాలన స్థాపింపబడిన పిదప నీ దేశమును పరిపాలించుట కంపబడిన వారిలోకెల్ల విలియం బెంటింకు, సర్ తామస్ మన్రో, స్ట్రాచీ, ఎల్‌ఫి౯స్టనులు చాలా ఉదారులైన రాజ్యనీతిజ్ఞు లని పేరుపొందినారు. వీరికాలమున నింగ్లాండులో గూడా ఉదారరాజనీతిజ్ఞులే ప్రభుత్వము చేయు చుండినంచున నచ్చటగూడా ప్రజలకు ప్రాతినిధ్యము వృద్ధిచేయ బడినదనియు, నీ దేశమునగూడా కొంత ఉదారరాజ్యపరిపాలనా పద్ధతి అమలుజరుగుట కదియె కారణమనియు రమేశచంద్ర దత్తుగారు వ్రాసియున్నారు. ఆనాడు మన దేశమున రాజకీయ సంస్కరణలు కొన్ని జరిగినమాట వాస్తవమే; భారతీయులకు హెచ్చుగా ఉద్యోగము లివ్వవలెనని విద్యనేర్పవలెనని వీరు శిఫారసుచేసిన మాటయు నిజమే; తక్కిన పరిపాలకులతో పోల్చిచూచినచో వీరు ఉదారులను మాటయుగూడ నిజమే;గాని భారత దేశమున ఉదార రాజనీతికింగ్లాండులో ఉదార రాజనీతిజ్ఞులు ప్రభుత్వము వహించుట మాత్రము కారణముకాదు. నిజముగ నీ దేశము నింగ్లాండు ఆక్రమించుటలో గాని దీనిని ఇంగ్లాండు లాభముకొర కుపయోగించుటలోగాని ఆంగ్లేయ రాజకీయ పక్షముల వా రెవ్వరు వెనుకబడినవారుకారు. విలియంబెంటింకు, మన్రో, ఎల్‌ఫి౯స్టను లెంతమంచి వారైనను భారతదేశపరిపాలనమునం దెంత ఔదార్యబుద్ది చూపినను అసలు వ్యవహారమందు మాత్రము వీరు వెనుకబడ