Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


రాగానే రాజ్యాక్రమణయుద్ధమునకు దిగెను. దీనికి కారణము లాంగ్ల రాజ్యమునకు సరిహద్దులలో మైసూరులో హైదరాలీ టిప్పూలు బలవంతులై ఫ్రెంచివారి సాయముతో నాంగ్లేయులను వెళ్ళగొట్టవలె నని ప్రయత్నించుచుండి రనియు, మహారాష్ట్రులును బలవంతులై విజృంభించుచుండిరనియు జెప్పిరి. కార౯వాలీసు టిప్పూసుల్తానుపైన దాడివెడలి 1799 లో నతని నోడించి చాలరాజ్యమును లాగికొని అనేక లక్షల ధనము పుచ్చుకొనెను. కొంతరాజ్యమును నైజాముకిచ్చెను. రాజ్యాక్రమణ యుద్ధములన్న తమ కిష్టములేదన్న ఆంగ్లపార్లమెంటు కారన్ వాలిసుకు "మార్క్విస్” ప్రభు బిరుదునిచ్చి గౌరవించిరి!

II

కారన్ వాలీసు తరువాత గవర్నరు జనరలులైన వెల్లస్లీ హేస్టింగ్సులు సామ దాన భేద దండోపాయములను స్వేచ్చగా ప్రయోగించి అనేకములగు అక్రమరాజ్యాక్రమణయుద్ధములు గావించి చాలా భూభాగములను బ్రిటిషు ఇండియాలో చేర్చిరి. వెల్లస్లీ కాలముననే మద్రాసు రాజధాని పూర్తియై తూర్పుతీరమెల్ల బ్రిటిషువారిదైనది. హేస్టింగ్సు కాలమునాటికి కలకత్తా, మద్రాసు, బొంబాయి, రాజధానులు నేటిరూపము దాల్చినవి. అనేక సంస్థానాధిపతులతో స్నేహసహకారసంధులు జరిగినవి. మెల్లగా వారి సంస్థానములందు సైన్యములు నెలకొల్పబడి బ్రిటిషువారి పలుకుబడియు అధికారమును గట్టిచేయ