ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము
195
పౌనులును, జీతవృద్ధియగునట్లు నిర్ణయింపబడెను. కలెక్టర్లకు జీతముతోపాటు రివిన్యూ వసూలుమొత్తముపైన కమీష నుండెను. లంచము లెప్పటివలె సాగుచునేయుండెను. బెనారసు రెసిడెఁటుకు నెలకు వేయిరూపాయిల జీతముండగా నత డనేకదుర్మార్గములద్వారా సాలుకు నాలుగులక్ష లార్జించుచుండెను. కారన్ వాలిసు అతనిజీతమును నెల 1కి అయిదువేలకు హెచ్చించెను. ఇట్లే వంగరాష్ట్ర సివిలుసర్వీసు ఉద్యోగుల జీతములను 1787 లో కార౯వాలిసు హెచ్చించెను. భారతదేశపరిపాలనమున కేవలము ఆంగ్లేయోద్యోగుల నత్యధిక జీతములమీద నియమించుపద్దతిని కార౯వాలిసే ప్రారంభించినాడు. కంపెనీ ప్రభుత్వము కేవలము ఆంగ్లేయుల వలననే జరుగవలెనని ఇతని పట్టుదల. భారతీయుల కెవ్వరికిని ప్రవేశ మివ్వలేదు. ఇక భూమిశిస్తులను శాశ్వతముగా నిర్ణయించి భూములలో రైతుల కెట్టిహక్కులు కలవో అనియైన యోజింపక ఆ భూములెల్ల జమీందారుల వశముచేయు పర్మనెంటు సెటిల్మెంటు పద్దతిని స్థాపించుటలో నితని యుద్దేశము కేవలము కంపెనీవారికి శిస్తులవసూలు సులభసాధ్యము చేయుటయే ! ఈ సంస్కరణములయొక్క నిజస్వభావ మింకొకచోట చర్చింపబడినది.
కారన్ వాలిసు రాకపూర్వము 1784 లో నింగ్లాండు పార్లిమెంటువారు తమకు రాజ్యాక్రమణ యుద్ధములన్న ఇష్టము లేదనియు ఇది ఆంగ్ల జాతీయ గౌరవమునకును ధర్మమునకును విరుద్దమనియు ప్రకటించి యుండిరి; కాని కారన్ వాలిసు