పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

197


బడెను. దీనిని గూర్చిన వివరములు 'సంస్థానముల సమస్య' అను ప్రకరణమున గలవు.

1783 లో ఫాక్సుమంత్రియొక్క ఇండియా బిల్లును గూర్చి పార్లమెంటులో మాటలాడుచు బర్కుమహాశయుడిట్లు పలికినాడు:

"హిమాలయమునుండి కన్యాకుమారివరకును పెద్దవాడైనను పిన్నవాడైనను ఏ రాజ్యముగాని రాజుగాని మనతో సంబంధముగల ప్రతివానిని మనకంపెనీ అధికారులు విక్రయించి వారిపట్ల ద్రోహముచేసియున్నారు. అట్లు విక్రయించినందు వలని లాభము చేతికి చిక్కనిచో అది వేరే సంగతి. మనవారు చేసిన సంధిపత్రములలో మనవారు షరతులకు భంగకరముగా నడువని సంధిలేదు. మన కంపెనీవారిని నమ్మిన రాజులలోను, రాజ్యములలోను నాశనముగానిది లేదు. ఈజాతిని నమ్మకుండా మనతో విరోధించినవారుతప్ప మంచిస్థితిలో నున్నవారు లేరు. ఈసంగతులు సర్వసామాన్యములైనవి. ఇది కేవలము బాహ్యసంబంధములకు రాజకీయములకు సంబంధించిన సంగతి. ఆంతరంగిక విషయములను గూర్చిగూడ ఇటువంటి సంగతులనే మీకు నేను చూపగలను" అనినాడు.

ఇది నిజమని మొదటినుండియునీ దేశమున జరిగిన కథ వలన తెలియగలదు. గవర్నరుజనరలు వెల్లస్లీయు నతని సోదరుడగు అర్దర్ వెల్లస్లీయు కుటిల రాజ్యతంత్రమునందు నిపుణులు. వెల్లస్లీపరిపాలనమునకు రాగానే అతడు మహారాష్ట్ర రాజ్యసమేళనమును భగ్నము చేయదలచెను. వారిలో నెవరినో యొకరిని