పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వార౯ హేస్టింగ్సు ఘనకార్యములు

179


పోయెను. ఈ విచారణ 1785 లో ప్రారంభమై 1795 లో ముగిసినది. విచారణ నారంభించినప్పుడు సభలో 160 మంది ప్రభువులు పాల్గొనిరి. తీర్పుచెప్పునప్పుడు 29 మంది మాత్రమే తమ వోటు నొసగిరి. ఈలోపుగా హేస్టింగ్సు రాజసమ్మానమును పొందుచునేయుండెను. ఇతడొక యింటికి దాని యుద్యానవనమును నిర్మించుటకు 40 వేల నవరసులు ఖర్చుపెట్టి కులుకుచుండెను.

“ఈ వార౯ హేస్టింగ్సు భారతదేశములోని పరిపాలనా విధానమును తన స్వప్రయోజనముకొఱకు నాశనముచేసినాడు. తాను నిర్వహించవలసివచ్చిన అధికారములు నిర్వహించలేదు. తన చేతిలోని కీలుబొమ్మలుగానుండు ఒక కమిటీని నియమించి సాలుకు 62 వేల పౌనుల చొప్పున దుర్వినియోగము చేసినాడు. ఒక దుర్మార్గుడగు తన వశవర్తిని ఆ కమిటీకి దివానుగా జేసినాడు.

గంగా గోవిందుసింగుదగ్గఱ లంచము పుచ్చుకొన్నాడు. లంచము పుచ్చుకొనియు అతనికి ద్రోహముచేసినాడు. అనేకుల వలన లంచములు పుచ్చుకొని వారిని కొల్లగొనినాడు. వితంతువుల ఆస్తిని కాజేసినాడు. అనాధలయొక్కయు, తల్లిదండ్రులు లేని పిల్లల యొక్కయు ఆస్తులను లాగివేసి తన వశవర్తులగు దుర్మార్గుల కిచ్చినాడు.

ఒక మైనరు రాజుయొక్క శాస్త్రీయ సంరక్షకులను తొలగించి వాని జమీందారీని దుర్మార్గుడగు దేవసింగుకిచ్చినాడు. మూడు పెద్ద రాష్ట్రముల పరిపాలన నీ దేవసింగువశము