పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


జేసి ఆరాజ్యములందలి రైతులఇండ్లను తగులబెట్టించి, కుప్పలు లాగికొని హింసించి, వారిస్త్రీలను జెఱచి, వారి నవమానపరచి నష్టపర్చినాడు. బ్రిటిషుజాతి కవమానము తెచ్చినాడు. భారతదేశములోని ప్రజల ధర్మములను హక్కులను స్వాతంత్ర్యములను తలక్రిందులుజేసి వారి ఆస్తిని నాశనముచేసి వారి దేశములను పాడుపెట్టి ధర్మవిధ్వంసముజేసి, మానవత్వమునే భంగపరచినాడు." అని బర్కు మహోపన్యాసముచేసినాడు. ఆయనయు షెరిడను మొదలగువారు చేసిన నేరారోపణలను వినినవారి వారన్ హేస్టింగ్సుమానవరూపముననున్న రక్కసివలె కనపడినాడు; గాని పార్లమెంటులో నీ వార౯ హేస్టింగ్సుకు పక్షపాతులు లేకపోలేదు. యార్కు ఆర్చి బిషప్పు కొమారునికి వార౯ హేస్టింగ్సు చేసిన ఉపకారమును బట్టి అతడొక పక్షపాతిగా నుండెను. కంపెనీ డైరెక్టర్లకోర్టు అధ్యక్షుడగు సల్లివన్ యొక్క కొమారునికి వారన్ హేస్టింగ్సు బంగాళారాష్ట్రమున నాల్గు సంవత్సరములకు నల్లమందు ఇజూరా నిచ్చెను. దాని నతడొక స్నేహితునికి 40 వేల పౌనుల కమ్ముకొనెను. ఆ స్నేహితుడు ఆ హక్కునే ఇంకొకనికి 60 వేల పౌనులకమ్ముకొని లాభము పొందెను. ఇంగ్లీషు రాజకీయములందు వారన్ హేస్టింగ్సు పార్టీ వా రొకరు బయలుదేరి అనేక అన్యాయములు జరుపసాగిరి.

ప్రభువుల సభవారు తుదకు 1795 వ సంవత్సరము ఏప్రిలు 28 వ తేదీన వారన్ హేస్టింగ్సు పైన కేసును కొట్టివేసిరి. ఇట్లు భారతదేశ ప్రజలకు జరిగిన ఘోరాన్యాయమును గూర్చిన మొదటి యభియోగము వృధయైపోయెను. ఈ అన్యా