178
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
కనుజ్ఞ నిచ్చి, ఈ నిర్బంధితులను నవాబు శిక్షించదలచినాడు గనుక ఆయన నౌకరు లీ నిర్బంధితులదగ్గఱకుపోయి యిచ్చ వచ్చినట్లు చేయుటకు తాను వ్రాతమూలకమగు అనుజ్ఞాపత్రమును వ్రాసియిచ్చెను! వారుచేసిన పాపమేమనగా గతించిన యజమాని వారి కప్ప జెప్చిన ధనమును వీరి కివ్వక పోవుటయే. చిన్న రాణిని 1200000 నవరసులిచ్చువరకు తిండిపెట్టక మాడ్చి హింసించెను! ఈ చర్యలకు నవాబు తరువాత పశ్చాత్తాపము జెందెను. గాని వారన్ హేస్టింగ్సుకు మాత్రము పశ్చాత్తాపము కలుగలేదు.
III
వారన్‌హేస్టింగ్సుచర్యల విచారణ.
వారన్ హేస్టింగ్సు చాల తెలివైనవాడు; గొప్ప రాజ్య తంత్రజ్ఞుడు; నిపుణుడగు పరిపాలకుడు; గాని ఇతడుచేసిన ఘోరకృత్యము లసంఖ్యాకములు. ఇతడు 1785లో నింగ్లాండునకు వెళ్లెను. అంతట కామన్సుసభవా రీతనిపైన నేరారోపణ గావించగా ప్రభువుల సభలో విచారణజరిగెను. ఈతడు చేసిన అన్యాయములు నేరములు దీర్ఘముగా చర్చింపబడెను. గాని ఆంగ్లరా జితనికి సహాయుడయ్యెను. కంపెనీ వారితనిని గౌరవించిరి. ఇతనిని విచారించు ప్రభువుల సభవారి అధ్యక్షుడగు లార్డుచాన్సిలర్ తర్లొ యితని కండయైయుండెను. అందువలన నీతని యన్యాయములను పూసగ్రుచ్చి వర్ణించి మహోపన్యాసములు చేసిన బర్కు మహశయు డెంత కష్టపడినను లాభము లేదనియు నితనిని వదలివేయుదురనియు అందరికిని తెలిసి