పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నుండెను. ఈరాజ్యము విస్తీర్ణమునందు జనసంఖ్యయందు ఇంగ్లాండును మించెను. ఆదాయము 3 1/2 కోట్ల రూపాయిలు,

ఆంగ్లపార్లిమెంటుచేసిన రెగ్యులేటింగు చట్టము ప్రకారము వార౯ హేస్టింగ్సు 1774లో మొదటి గవర్నరుజనరలై 1785 వరకును పరిపాలించెను. బుద్ధిసూక్ష్మతయందు వారన్ హేస్టింగ్సును మించిన ఆంగ్లేయుడు లేడని చెప్పవచ్చును. నిరంకుశ పరిపాలనము చేయుటలో, మిత్రభేదము చేయుటలో, ధనము సంపాదించుటలో నితనిని మించినవారు లేరు. భారతదేశ భాగ్యభోగ్యములను హరించి బ్రిటీషు ప్రజలకు లాభము కల్గించు మార్గములనెల్ల ఇతడు స్థాపించెను. నాటి గవర్నరుజనరలు ఇంగ్లీషుపార్లమెంటునేగాక ఇంగ్లాండులో తూర్పుఇండియా వర్తక సంఘమువారినిగూడా సంతృప్తి పరుపవలసి యుండెను. కంపెనీవారికి అమితలాభము కలిగించుట కిచ్చట నిరంకుశ పరిపాలనము చేయవలసియుండెను. భారతదేశము పరిపాలనమున వారన్‌హేస్టింగ్సు ఎన్నో అన్యాయములను గావించెనని భారతదేశ ప్రజలను బాధించెనని పార్లమెంటులో నితనిపైన నేరము మోపబడిన సందర్భమున తూర్పుఇండియా వర్తకసంఘము వారి దుష్టపరిపాలనమును అందువలన భారతీయులు పొందుచుండిన బాధలును బయల్పరుపబడెను.

II

కుటిల రాజ్యనీతి

కంపెనీ ఖజానాను నిండించుటకు వారన్‌హేస్టింగ్సు అనేక ఘోరకృత్యములుచేసెను. వంగరాష్ట్ర నవాబుయొక్క