Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వార౯ హేస్టింగ్సు ఘనకార్యములు

175


అధికారములు తొలగించునప్పుడు క్లై వాతనికి సాలుకు 53 లక్షలిచ్చెదనని వాగ్దానముచేసియుండెను. క్రొత్తనవాబు తక్తు నెక్కునప్పుడు క్లైవు ఆ మొత్తమును 41 లక్షల రూపాయలకు తగ్గించెను. మూడవనవాబు కాలములో నీ అలవెన్సు సాలుకు 32 లక్షలకు తగ్గింపబడెను. వార౯హేస్టింగ్సుకాలమున నీ సింహాసనమునకు వచ్చిన నాలుగవ నవాబు చంటిపిల్లవాడు. అంతట హేస్టింగ్సు ఆయసహాయుని అలవెన్సును సాలుకు 16 లక్షలకు తగ్గించివేసెను. వారన్ హేస్టింగ్సు అలహాబాదు కోరా పరగణాలను అయోధ్య నవాబుకు విక్రయించి 50 లక్షల రూపాయిలు పుచ్చుకొనెను. వంగరాష్ట్రమును దీవానీగా నిచ్చినప్పుడు ఢిల్లీచక్రవర్తితో చేసికొనిన సంధిపత్రము దాఖలా ప్రతియేట నతనికి చెల్లించవలసిన 26 లక్షల రూపాయిలు కప్పమును తీసివేసెను. చక్రవర్తి అసహాయుడైనందున ఏమిచేయగలడు? అందువలన వాగ్దానభంగము చేయుటకు వారన్ హేస్టింగ్సు వెనుదీయలేదు. ఈ యన్యాయములన్నియు చూడగా భారతీయుల కింగ్లీషువారి ధర్మముపైన రోతకలిగెను. కాని హేస్టింగ్సు చేసినదురంతము ఇంతటితో ఆగలేదు. ధనము పుచ్చుకొని రోహిలాను దోపిడిదొంగల కప్పగించివేయుట, నందకుమారు నన్యాయముగ నురిదీయుట, అయోధ్యరాజుల పట్ల ద్రోహముచేయుట, యింకను తరువాయిగానే యుండెను. అవిగూడచేసి యితడు పుణ్యము గట్టుకొన్నాడు.

రోహిలఖండము సుభిక్షమైన దేశము. ఈ రాజ్యము