వార౯ హేస్టింగ్సు ఘనకార్యములు
173
జిల్లాలుగ విభజించి పన్నులవసూలుకొఱకు ప్రాతదేశీయోద్యోగులను తొలగించి జిల్లా కొక కలెక్టరును, నలుగురైదుగురు కలెక్టరులపైన ఒక కమీషనరును నియమించెను. వీరందరిపైన కలకత్తాలో రెవిన్యూ బోర్డు నేర్పరచెను. కలెక్టరులు జిల్లాలలో పన్నుల వసూలు హక్కు వేలమువేయుదురు. అంతే కాని తామే వసూలు చేయకూడదు. ఏలననగా ఆనాటి కలెక్టరులు విశేషముగా లాభములు పొందుచుండిరి. ఈయిజారా దారులు 'దివాను'లనబడి తరువాత జమిందారులైరి. సివిలు కేసులను విచారించుటకు ప్రాతన్యాయాధికారులను పంచాయితీలను తీసివేసి కలెక్టరులే నియమింపబడిరి. ఈ క్రిందికోర్టుల నుండి రివిన్యూ అప్పీళ్లను పరిష్కరించుటకు సదర్ దివానీ అదాలత్ అను కోర్టును, క్రిమినల్ వ్యవహారములను పరిష్కరించుటకు సదర్ నిజామత్ అదాలత్ అను రెండు ఉన్నత న్యాయస్థానములు స్థాపింపబడెను. పండితులును, ఖాజీలును ఈ ఇంగ్లీషు జడ్జీలకు సహాయము జేయుచుండిరి. కాని అమలు జరుపబడు ధర్మములన్నియు ఆంగ్లశాస్త్రధర్మములే. ఇది బాగా లేదని హేస్టింగ్సుఎరిగియు, న్యాయవిచారణాధికారము దేశీయ ప్రభువుల చేతులలోనుంచినచో వారి అధికారమునకును కంపెనీ యధికారమునకును ఘర్షణవచ్చునని తానిట్లు చేసితినని అతడే చెప్పినాడు.
1774 నాటికి బంగాళము, బీహారు, ఒరిస్సా, ఉత్తర సర్కారులు, చెన్నపట్టణము , బొంబాయి ఇంగ్లీషుపరగణాలుగా