పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

పూర్వపురాజు లిట్టిసమయములందు పన్నుల వసూళ్ళ నాపి రైతులకు సొమ్ము అడ్వాన్సులిచ్చి కాపాడుచుండిరి. కరవులందు ప్రజలనురక్షించుచుండిరి. పైనజెప్పిన ఘోరక్షామమున ప్రజలను కాపాడుటకైనను కంపెనీవారు తగిన శ్రద్ధ గైకొనలేదు. ధాన్యము ఎగుమతి మాత్రము నిలుపుదల జేసిరి.[1]

మూడవ ప్రకరణము

వారన్ హేస్టింగ్సు ఘనకార్యములు

I

రాజకీయ సంస్కరణలు

వారన్ హేస్టింగ్సు 1772 లో గవర్న రయ్యెను. ఈతడు నేటి పరిపాలనా పద్దతికి మూలపురుషుడని చెప్పవచ్చును. నవాబునకు 16 లక్షలిచ్చి బంగాళమును ఆంగ్లరాజ్యముక్రిందికి తెచ్చి తానే ప్రభుత్వము వహించెను. వారన్ హేస్టింగ్సు ప్రెసిడెంటుగా కౌన్సిలుతో కలసి 1773 లో రాజ్యంగసంస్కరణల పేరున దేశములో పూర్వకాలమునుండి అమలుజరగు చుండిన దేశీయ పద్ధతులను రూపుమాపెను. బంగాళమును కొన్ని

  1. కొందఱు జమీందారులు ప్రజలపట్ల కొంచెము దయదలపగా పన్నుల వసూలులో అశ్రద్ధ చేసిరని కంపెనీవారనేకుల నుద్యోగములనుండి తొలగించిరి. కరవులో మాడుచున్న వారికిచ్చుటకు మంజూరు చేయబడిన స్వల్పపుధాన్యము కంపెనీ యుద్యోగులు హరించి దొంగ లెఖ్కలు వ్రాసి స్వంతవ్యాపారము సాగించిరి. ఈ ఘోరాన్యాయము సీమవారికి గూడ తెలిసెను . తెల్లదొరలు నల్లవారిపైన నీ నింద వేయుటకు ప్రయత్నించిరి. నిజమైన వారి పేర్లు మాత్రము బయటకు రాలేదు !