పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

171


నిరంకుశత్వము, నాగరకతయొక్క బలమునుగల ఈక్రొత్త ప్రభుత్వము వీరిని పీడించుచుండెను."

1770 లో బంగాళారాష్ట్రమున నొక ఘోరక్షామము వచ్చెను. ఈ కఱవు వచ్చుటకు కంపెనీవారే కొంతవరకు బాధ్యులు. 1768 లోనే బంగాళారాష్ట్రమున వరిపంట లెల్ల నష్ట మై పోయెనుగాని పన్నుల వసూలు నిలుపబడలేదు. ధరలు విపరీతముగా హెచ్చెను. రైతులకు విత్తనములు గూడా మిగుల లేదు. కాని 1769లో బంగాళములోని ధాన్యమంతయు నితరచోట్ల కెగుమతి చేయబడెను. మద్రాసు మొదలగు స్థలముల బేరగాండ్లువచ్చి కొనివేసిరి. దీనివలన దేశమునకు కీడుమూడునని కంపెనీ వారెఱిగియు ఏమియు చర్యగైకొనలేదు. 1769 లో అతివృష్టి వలన పండిన కొంచెము పంటకూడా పోయెను. సీమకు వ్రాసిన ఉత్తరములలో నీ దుస్థితినిగూర్చి యెవ్వడు వ్రాయడయ్యెను. 1770 జనవరిలోమాత్రమొక చిన్న వాక్యములో - ఒక జిల్లాలో తిండిలేక ప్రజలు బాధపడుచున్నారనియు, అయినను రివిన్యూకు ఫరవాలేదనియు వ్రాసిరి. పన్నుల వసూలేకాని ప్రజల ప్రాణ రక్షణ తమపని కాదని వీరియూహ ! ప్రతిరోజున వేలకొలది శవములీ ఇంగ్లీషు పరిపాలకుల యిండ్లదగ్గఱకు కొట్టుకొని వచ్చుచుండెను. కలకత్తావీధులు శవములతోను చచ్చువారితోను నిండియుండెను. వంగరాష్ట్ర జనసంఖ్యలో మూడింట రెండు వంతులు అనగా నొకకోటిమంది యీక్షామమున మరణించిరి. (ఇంపీరియల్ గెజెటీరు 2 వ వాల్యూము 480 ఫుట