పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


అనేక రూపములగు అనవసరపు ఖర్చులు అత్యధిక వ్యయములు ప్రబలినవి. రాజధానిలో ప్రతిశాఖలోని ఆంగ్లేయోద్యోగు లెల్లరికి నీ దురభ్యాసము లధికములైనవి. పెద్దయధికారులతోపాటు తాము కూడా సొమ్ము విచ్చలవిడిగా ఖర్చుచేయుట వలన తమకు అధిక గౌరవము కలుగునని చిన్నవారు తలంచుచుండిరి. అందువలన దుబారా ఖర్చులు చేయుటయే యొక వ్యసనముగ పరిణమించెను. అందుకొరకు కావలసిన ధన మేదోవిధముగ సంపాదింపవలెనుగదా! ఇట్టి స్థితిలో తమ చేతులలోగల అధికారము నిందుకొరకు దురుపయోగము జేసి సామాన్య లంచగొండితనమువలన కావలసినసొమ్ము లభించనిచో ప్రజాపీడనకు దిగుటలోను నాశ్చర్యమేమిక లదు? పై వారినిజూచి క్రిందివారు, వీరినిజూచి చిల్లర సేవకులు గూడ నీదురాచారములందు దిగుట సహజపరిణామము. ఈయన్యాయ విధానము దేశములోని సివిలు మిలిటరీ శాఖలందలి యుద్యోగులం దరియందును సామాన్య గుమాస్తాలయందును వర్తకులందును ప్రాకిపోయినది. (Quoted by R. C. Dutt-India under Early British Rule)కంపెనీయుద్యోగులయధికారమును పురస్కరించుకొని ఐరోపాజాతి ఏజెంట్లు ప్రారంభించిన ప్రజాపీడనము , హింసలు, అసంఖ్యాకులగు నల్లగుమాస్తాలు ఏజెంట్లు సబ్ ఏజంట్లు కలిసిచేయు ఘోరములు, ఈ దేశములోని ఆంగ్లేయులకు చాల చెడ్డపేరు తెచ్చుచున్నది. ఈదురాచారముల నంత మొందించుటకు దివానీగిరీవలన త్వరలోనే మార్గ మేర్పడగలదని సంతసించుచున్నాను. ఈ దివానీగిరీ యనగా వంగరాష్ట్రము బీహారు