పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

163


నవాబుమొదలు చిన్నజమిందారువరకు అందరివలన నీ కంపెనీ అధికారులు సివిలు మిలిటరీశాఖలవారు లెక్కలేనంత సొమ్ము లాగికొనుచుండిరి.

"ఈ ప్రాంతములందు దళారీ వర్తకులే వ్యాపారము చేయుట ప్రారంభించినారు. వీరు కంపెనీ యుద్యోగుల గుమాస్తాలుగా వ్యవహరించుచు, వారి యధికారములను పురస్కరించుకొని వారి పేరున అనేకములగు అక్రమపు చర్యలు జరిగించుట మొదలిడిరి. దీనివలన హిందువులకు మహమ్మదీయులకుగూడ ఆంగ్లేయులపైన రోత కలిగినది. నవాబు తన దేశాదాయమును వసూలు చేసికొనుటకే కంపెనీ యుగ్యోగులు పెక్కు ఆటంకములు కలిగింపసాగిరి. తమ కిచ్చవచ్చినట్లు నవాబు క్రింది యుద్యోగులను నియమించుటకును తొలగించుటకును తమ ప్రాపకమును పలుకుబడిని వినియోగించుచుండిరి. (Malcolm Life of Clive) ఈ యన్యాయములనుగూర్చి క్లైవు మరల వ్రాసి వీనిని తొలగించుటకు కొన్ని సూచనలనుకూడా చేసినాడు. ఇది చాలా సుప్రసిద్ధమైన లిఖితాధారము.

"నేనిక్కడికిరాగానే యిచ్చట మీవ్యవహారములు చాల దుస్థితిలోనుండుటను పొడగాంచితిని. కేవలము స్వార్థచింతతోనే ప్రవర్తించువారుగాక ఏమాత్రమైన ఆత్మగౌరవముగాని తమ యజమానులపట్ల బాధ్యతగాని కలవారి కీ పరిస్థితులు చాల భయంకరముగ గనబడితీరును. చాలమందికి ఎట్టి కష్టమును పడకుండగనే ఎట్లువచ్చినది తెలియకుండగనే ఆకస్మికముగా ఐశ్వర్యము కలుగుచుండుటవలన లేనిపోని సుకుమారము బలిసి