160
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
40 వంతులుకు తక్కువ ధరలు నిర్ణ యింతురు. ఈ యన్యాయపు ముచ్చిలకా ఒడంబడికలప్రకారము జరుపలేని నేతగాండ్రనుభవించు బాధలు వర్ణనాతీతములు. వారి సామగ్రిని జప్తు జేసి సామానులెల్ల బాకీక్రింద బలవంతముగా అచ్చటనే వేలమువేసి అమ్మించివేయుచుండిరి. పచ్చిపట్టునుతీయువారికిగూడ ఈగతియే పట్టుచుండెను. ఈబాధలు పడలేక పట్టుతీయుడని నిర్బంధము లేకుండా వారు తమ బొట్టనవ్రేళ్ళను నరికివేసుకొనిన ఉదాహరణము లనేకములు గలవు."
ఈ ఘోర పరిస్థితులవలన వంగరాష్ట్రములోని వ్యవసాయముగూడా పాడైపోయినది. రైతులు సాధారణముగా భూస్వాములుగను పారిశ్రామికులుగను ఉండిరి. ఆంగ్లేయ గుమాస్తాలు పెట్టు బాధలవలన వీరు తమ పొలములు బాగు చేసికొ'నలేక శిస్తు లిచ్చుకొనలేక రివిన్యూ అధికారుల కోపమునకు అన్యాయములకు పాత్రులై బాధలుపడుచు పొలముల నమ్ముకొని పోవుచుండిరి. నవాబుచేసిన ఫిర్యాదుల నాలించి ఆనాటి గవర్నరగు వాన్సిటార్టు, వారన్‌హేస్టింగ్సు లీయన్యాయములు బాపుటకు కొంత ప్రయత్నించిరి గాని లాభము లేక పోయినది. తక్కిన అధికారులు కేవలము స్వార్థపరులై వీరిమాటలు పెడచెవినిబెట్టిరి. అంతట నీనవాబు ధైర్యము వహించి దీనికి ప్రతిక్రియగా ఆంగ్లేయులతో పాటు తన ప్రజలు స్వేచ్చగా వ్యాపారము చేసికొనుటకు దేశములోని నాటు వర్తకము పైన సుంకము లసలే తీసివేయుటకు నిశ్చయించెను. అంతట నీ తెల్లదొర లిది యన్యాయమని హాహాకారములుసలిపి