పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

159


మికుడు తయారుచేసి ఒప్పగించవలెనో, ఎంతధర కివ్వవలెనో ఆంగ్లేయ దొరలును, వారి కోమటి దళారీలును, గుమాస్తాలును తమ చిత్తానుసారముగా నిర్ణయింతురు. ఆయా వస్తువుల తయారుచేయు పట్టణమునకు గుమాస్తా రాగానే అతడొకచోట విడిదిసేయును. అది తనకచ్చేరీయని వ్యవహరించును. తన జవానులను 'హర్క రాలను' ముందుగా పంపి దళారీలను పై కారులను నేతగాండ్రను పిలిపించును. తనయజమానులంపు సొమ్ముకు ప్రతిఫలముగా కొంతనిర్ణీతపు మొత్తము సరకును నిర్ణీత ధరకు నిర్ణీతగడవు లోపల నిచ్చునట్లు వారిచేత ఒడంబడిక పత్రములు వ్రాయించును. కొంత బయానా నిచ్చును. నేతగాని అంగీకారముతో నిమిత్తములేదు. సాధారణముగా గుమాస్తా బలవంతముగానే పత్రములు వ్రాయించును. ఆ సొమ్ము వుచ్చుకొనుటకు నేతగాండ్రంగీకరించనిచో సొమ్ము నడుముకుగట్టి కొట్టి పంపివేయుట సర్వసాధారణముగా జరుపబడుచర్య. ఈ నేతగాండ్రలో చాలమందిపేళ్ళను గుమాస్తా తన రిజిష్టరు పుస్తుకములలో నమోదుచేసి యితరులెవ్వరికిని పనిచేయకుండ నిరోధించును. ఇది నవీన బానిసత్వముగా పరిణమించును. గుమాస్తాలు తమ రిజిస్టర్లలోని పేళ్ళ నింకొక గుమాస్తా లెక్కలలోనికిఎక్కించుచు నీదాస్యమును శాశ్వతముగా అమలులోనుంతురు. దీనిలో జరుగు అన్యాయములకు మోసములకు లెక్క లేదు. దీని నష్టములెల్లను అనుభవించువారు నేతగాండ్రే. ఈ గుమాస్తాలను వస్త్రనాణెగాండ్రును ఏకమై ఆ సరకులు బజారు విలువకన్న నూటికి 15 మొదలు