పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

151


పుచ్చుకొని ఆ నవాబుతో స్నేహమును నటించెను. గాని లోలోపల నీతనిని సింహాసనభ్రష్టునిచేయుటకు కుట్రలుచేయ సాగెను. నవాబుయొక్క దగ్గరబందుగుడును సేనానాయకుడును అగు మీర్జాఫరునకు సింహాసనము నిచ్చుటకును ముర్షిదాబాదు వర్తకుడగుజగత్సేటుకును కలకత్తాలోని వర్తకుడగు ఉమచందునకును విశేష ధనలాభముచేకూర్చుటకు కుట్రచేసెను. తనతో చేయు సంధిపత్రములో నీషరతు స్పష్టముగా వ్రాయవలెనని ఉమచందుకోరగా క్లైవుకపటనాటకమునాడి కర్నల్ వాట్సను సాక్షిసంతకమును తానే సృష్టించెను. తరువాత నీ కూటసృష్టి పత్రముసంగతి ఉమచందుకు తెలియగా నతనిగుండె పగిలి పిచ్చివాడైపోయెను. క్లైవు యెట్టి యన్యాయము చేయుటకును వెరవడు. నవాబుయొక్క మహాసైన్యములను తనస్వల్పసైన్యములతో నెదరించి గెలుచుట కష్టమని ఎరిగి నవాబు సైన్యములలో కొన్నిటిని తనవంకకు త్రిప్పుకొని ఆకస్మికముగాస్వామిద్రోహముచేయుట కేర్పాటు చేసియుండెను. ఇట్లు మిత్రభేదమువలన స్వామిద్రోహమువలన కూటసృష్టివలన క్లైవు ప్లాసీయుద్ధమున గెలుపొంది బ్రిటిషుసామ్రాజ్య స్థాపనకు కారకుడయ్యెను. (23 జూను 1757) సురాజుద్దౌలా నిట్లు ద్రోహముచేసిన క్లైవు మిర్జాఫరులు వంగరాష్ట్ర బీహారు ఒరిస్సాల నపహరించిన విధానము చిత్రమైనది. మీర్జాఫరు కంపెనీవారికి 2140000 పౌనులును, క్లైవుకు లంచముగా 20 లక్షల సవరనులు నిచ్చుపద్ధతి నీపరగణాల సింహాసనమును మీర్జాఫరుకొసగునట్లు కంపెనీ వారు ఢిల్లీ చక్రవర్తిని ప్రోత్సహించిరి. మీర్జాఫరు క్లైవుపట్ల