150
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
మొగలుసామ్రాజ్యములో చేరిన అయోధ్య, వంగ, బీహారు, ఒరిస్సాలకు రాజప్రతినిధులు అయోధ్య వజీరులనియు, వంగరాష్ట్ర నవాబులనియు ప్రఖ్యాతిగాంచి పేరునకు చక్రవర్తికి సామంతులుగ నుండినను, నిజమునకు స్వతంత్రులగు రాజులుగ నుండిరి. వంగరాష్ట్ర నవాబుయొక్క ముఖ్యపట్టణము ముర్షిదాబాదు. ఇది బహు సుందరమై ధనవంతమై నాటి లండనునగరముతో తులతూగుచుండెననియు లండనులో కన్న నీ నగరమునం దెక్కుడు ధనవంతులు గలరనియు క్లైవు వర్ణించియున్నాదు. ఈ రాజ్యమునకు 1756 లో సురాజ్ ఉద్దౌలాయను యువకుడు నవాబయ్యెను. క్లైవును సమర్థించుటకు ఆంగ్ల చరిత్రకారు లితనినిగూర్చి అనేకములగు అసత్యవు వ్రాతలు వ్రాసి యితనిని దుర్మార్గుడని చిత్రించియున్నారు. గాని ఇతడు నిజముగ నట్టి దుర్మార్గుడుకాడు. ఇతనిచుట్టును చేరినవారు మాత్రము స్వామిద్రోహముచేసిన దుర్మార్గులుగ నుండిరి. అట్టివారిలో నొకనికి కలకత్తాలోని ఆంగ్లేయ వర్తకకంపెనీవారు ఆశ్రయమిచ్చి అతనిని నవాబుకు ఒప్పగింపకపోగా నతడు కోపించి కలకత్తాను పట్టుకొనెను. ఈ సందర్భమున నితడు ఇంగ్లీషువారిని బంధించి చీకటికొట్టులో పడవేయించగా చాలమంది చచ్చిపోయిరని ఒక కథ వ్యాప్తి జేయబడెను. ఇది అబద్ధమని బాసు, మొదలగు చరిత్రకారులు రుజువుపరచియున్నారు. మద్రాసునుండి క్లైవు నాటుదారిని, వాట్సను ఓడలపైనను కలకత్తాను రక్షించుటకు వచ్చిరి. క్లైవు అక్కడకు వెళ్ళినపిదప నవాబుయొక్క అధికారుల దగ్గఱనుండి లంచము