Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


చాలకృతజ్ఞుడయ్యెను. తన యాస్థానమున క్లైవు నొక ఉమ్రావుగా చేసెను. ఆ దర్జాను నిలుపుకొనుటకు తనకుతగిన రాబడి యుండవలెనని క్లైవుకోరగా సాలుకు 30 వేలపౌనుల రాబడి గల 882 చతురపుమైళ్ళ జాగీరును క్లెవు జీవితమువరకు క్లైవు అనుభవించి తరువాత కంపెనీవారికి చెందునట్లు మీర్జాఫరు దానమిచ్చెను. (1759) ఈ యపాత్రదానఫలితమగు భూభాగమే 'ఇరువదినాల్గుపరగణా'లని నేటికిని పిలువబడుచున్నది. ఈజాగీరును క్లైవు 1765 నుండి కంపెనీ వశముజేసి వారివలనప్రతి సాలున 1774 వరకు షుమారు 30 వేల నవరసులు క్విట్ రెంటును పుచ్చుకొనుచుండెను. ఇట్లు క్లైవు దమ్మిడీలేకుండా జీవితము నారంభించి 34 వ యేడువచ్చునప్పటికి అమిత ధనవంతుడయ్యెను. 1755 కు 1760 కు మధ్య నితడు ప్రైవేటు వర్తక కంపెనీలకు ఇండియానుండి 22000 నవరసులను పంపెనని, 25 వేల నవరసుల విలువగల వజ్రములు తరలించెనని, ఇంకను చాల సొమ్ముపంపెనని, అతనివద్ద ఇంకను నగదుండెనని, అతని లెక్కప్రకారమే సాలుకు 27 వేల నవరసు లాదాయము వచ్చు జాగీరు సంపాదించెననియు, ఇతని చర్యలను గూర్చి 1773 లో ఇంగ్లాండులో కామన్సు సభలో విశ్వాస రాహిత్య తీర్మానము చర్చింపబడినప్పుడు నేరారోపణచేయబడెను; గాని ఇతడు తన దేశమునకు మహోపకారము జేసెనని ఆతీర్మానమును త్రోసివేసిరి. ముర్షిదాబాదు ఖజానాలో మూల్గుచున్న రత్న రాసులు, ధనసంచయములు తనకాళ్ళదగ్గఱపడి యుండగా తానింత తక్కువమొత్తమునే తీసుకోనుట తనకే