పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నే ప్రాంతముననైనను వర్తక స్థానములు స్థాపించుకొనవచ్చునని చక్రవర్తి అనుజ్ఞ నిచ్చెను. ముఖ్యముగా సూరతు, వంగరాష్ట్రము సింధురాష్ట్రమును ఫర్మానాలో పేర్కొనబడెను. 1616 లో పడమటితీరమున కొన్ని వర్తకస్థానములు స్థాపించిరి. కళ్ళికోటలోను మచిలీపట్టణములోను ఫ్యాక్టరీలు స్థాపించిరి.

ఫ్రెంచి తూర్పుఇండియా వర్తకసంఘము 1614 లో స్థాపింపబడెను. ఫ్రెంచివారు పుదుచ్చేరీ, చంద్రనగరము, మహీ, మచిలీపట్టణము, డక్కా, పాట్నా, కాసీం బజారు మున్నగు చోట్ల వర్తకస్థానములు స్థాపించుకొని పుదుచ్చేరీని రాజధానిగా చేసికొనిరి.

పోర్చుగీసు వారివలెనే అంగ్లేయులును కొన్ని కోటలు, కట్టుకొని కొన్నిసైన్యము లుంచుకొన దలచిరి. కాని దీనివలన వ్యయ మధికమై లాభము తగ్గునని సర్ తామస్‌రో వలదని వారించెను.

ఆంగ్లేయుల సేవకులు తమ ఓడలపైన నేదైన నేరము జేసినచో వారిని విచారించుట కెట్టి యధికారములు గలవో అట్టి యధికారములే ఈ దేశములో తమ వర్తకస్థానములందు కూడ తమ కవసరమని చక్రవర్తిని ప్రార్ధించి 1624 లో నట్టి న్యాయపరిపాలనాధికారములను సంపాదించికొనిరి. ఈయధికారముల మూలమున మునుముందు తన ప్రజలపైనను. తన వారసులపైననుగూడ వీ రధికారము చలాయించి వారు లొంగనిచో వారిని బంధించి బాధింతురని చక్రవర్తి కలనైనను తలపడయ్యె.