పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


తరువాత ఢిల్లీ చక్రవర్తితో నెయ్యముసలిపిరి. తమ వ్యాపారమున కడ్డువచ్చిన యితర పాశ్చాత్యులతో సముద్రమున యుద్ధములు సేయుట తప్ప పోర్చుగీసువా రితరులతో పోరాడలేదు. అట్టి వారిలో ముఖ్యులు డచ్చివారు. డచ్చివారు 1611 సంవత్సరమున పోర్చుగీసువారి నోడించి వారి వర్తక స్థానమగు సూరతు పట్టణమును పట్టుకొనిరి. కాని హిందూ మహాసముద్రమునగల సారవంతములైన ద్వీపములు వారి నాకర్షించుట వలన హిందూదేశ భూముల నాక్రమించవలెనను వాంఛ తగ్గెను. ఇంతలో ఫ్రెంచివారును, ఇంగ్లీషువారును రంగస్థలములోనికివచ్చి లాభముపొందగోరిరి. ఫ్రెంచిమంత్రియగు కోల్బెర్ట్ (Colbert) తనదేశముయొక్క నౌకాదళము నభివృద్ధిజేయు సందర్భమున 'తూర్పు ఇండియా' వర్తక సంఘమును స్థాపింపదలచెను. ఇంగ్లీషు మంత్రులుగూడ భరతఖండముతోడి వర్తక మభిలషించిరి. ఎలిజబెత్తురాణి అక్బరుచక్రవర్తికి వ్రాసిన లేఖతో 1583 లో టైగర్ అను ఇంగ్లీషు వర్తకపు ఓడ బయలుదేరెను. 1599 సంవత్సరమున ఇంగ్లీషు తూర్పు ఇండియా సంఘము ఇంగ్లండుదేశ రాణీఎలిజబెత్తు ప్రభుత్వము వలన ఇండియాలో వ్యాపారము చేయబోవుట కనుజ్ఞనుపొందిరి. వర్తకము చేయబోవు నోడలలో సాధారణవర్తకుల నేపంపిరి. కొంచెము లాభమువచ్చినచోసంతసించిరి. పోర్చుగీసుడచ్చివ ర్తక సంఘములకు హిందూదేశమున వర్తకస్థానములు గిడ్డంగులు కోటలు నుండుట జూచి తమకుగూడ నట్టి వుండిన బాగుండుననితలచిరి. అప్పు డింగ్లాండు రాజుగనుండిన మొదటిజేమ్సు