Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

135


చినందు కాయనపనిని తీసివేసిరి! ఆయనను హిందువులు గౌరవించి సభజేయగా ఆయన ఆసభలో నొక మహోపన్యాసమును గావించి నాటి ప్రభుత్వవిధానమునందు క్రైస్తవమతాచార్యులకుగల విశేషపలుకుబడిని అందువలన జరుగుఅన్యాయములను బహిరంగపరచెను. 1845 నాటికి చాలమంది జడ్జీలు మతాచార్యుల కీలుబొమ్మలైయుండిరి. మదరాసు కోర్టు జడ్జి “సర్ విలియంబర్టన్" అను నాయన బహిరంగముగానే మతాచార్యులపై అభిమానమును చూపుచు ఆ యభిమానమును తన చర్యలలో వెల్లడించుటయేగాక న్యాయపీఠమున కూర్చున్నప్పుడు హిందువులకు స్వయముగా క్రైస్తవమతబోధను తానే చేయసాగెను. చెంగల్‌పట్టు జిల్లాజడ్జి యొకడు ఒక దినమున వ్యాజ్యములను విచారించుట మాని తన కోర్టు భవనమునందు ఒక క్రైస్తవ మతబోధకునిచేత నుపన్యాస మిప్పించెను!