134
భారత దేశమున
మిషనరీలు బలవంతము చేసినట్లు ఆయన చరిత్రలోకలదు. పాఠశాలలందు బైబిలును ప్రవేశపెట్టుటకు మిషనరీలు ప్రయత్నింపసాగిరి. బాలురు బైబిలు చదువునట్లు చేయుటకు ప్రపంచజ్ఞానమును పరీక్షించు నెపమున పరీక్షకులు బాలురను బైబిలు కథలనుగూర్చి ప్రశ్నింపసాగిరి. క్రైస్తవమతమున జేరిన హిందువుల ఆస్తిహక్కులు పోవుటవలన క్రైస్తవమత ప్రచారమునకు భంగకరముగ నున్నందున మిషనరీలు ఆనిబంధనను తీసివేయుటకు శాసనము చేయింపదలచిరి.
భారతదేశమున కంపెనీవారు తమ పరిపాలన ప్రారంభించినప్పుడీ దేశీయుల మతాచారవ్యవహారములతో జోక్యము కలిగించుకొనమనియు, అన్నిమతములపట్లను సహన భావముకలిగి యుందుమనియు, దేశీయులను క్రైస్తవమతములో కలుపుకొను ప్రయత్నము చేయమనియు వాగ్దానము చేసియుండిరి. కాని 1813 లో కంపెనీ పట్టానిచ్చు సమయమున క్రైస్తవమత బోధశాఖకు సాలుకు 20 లక్షల ఖర్చు మంజూరుచేసి వాగ్దానమునకు భంగకరముగా ప్రవర్తించి క్రైస్తవ మిషనరీలకు కంపెనీవారు సర్వవిధముల సహాయముచేయసాగిరి. ఉద్యోగులు బహిరంగముగా పక్షపాత బుద్ది చూపసాగిరి.
మద్రాసులో కంపెనీ ప్రభుత్వ కార్యదర్శియగు “తామస్" గారు క్రైస్తవులైన వారికి మాత్రమే ఉద్యోగము లివ్వసాగెను. చెన్నపట్టణమున నొక సదరుకోర్టు జడ్జి, దొరతనమువారు సూచించినట్లుగా క్రైస్తవ మతాచార్యులకు సహాయముచేయక, తనకు న్యాయమని తోచినట్లుగానే ప్రవర్తిం