ఈ పుట ఆమోదించబడ్డది
భారతదేశమున
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
ద్వితీయ భాగము
ఇంగ్లీషు దొరతనము : కంపెనీ రాజ్యము
1600 – 1857
మొదటి ప్రకరణము
ఇంగ్లీషువర్తకసంఘము
ఆంగ్లేయు లీ దేశమునకు వచ్చునప్పటి కిది యత్యంత భాగ్యవంతముగ నుండెను. ఈ దేశాధీశుల ఖజానాలు బంగారు వెండి నాణెములతోను, విలువలేని రత్నములతోను నిండియుండెను. ఈ దేశపరిశ్రమలు అభివృద్ధిలో నుండెను. ఇచ్చటి నుండి అనేకసరకు లెగుమతి చేయబడి బంగారు వెండి దిగుమతి చేయబడుచుండెను. ఈ దేశీయులు ఆశియా ఐరోపా ఆఫ్రికాలతో విరివియగు వర్తకము జరుపుచు అమితలాభము సంపాదించుచుండిరి. ఈ దేశపునూలు మజిలిను వలువలు, పట్టుబట్టలు, ఉన్ని శాలువలు, ఇత్తడి కంచు వస్తువులు ప్రపంచము నందెల్ల ప్రసిద్ధిగాంచెను.
ఐరోపాలోని వివిధ జాతులవా రీ దేశమునకు సముద్రమార్గము గనిపెట్టవలెనని అనేక శతాబ్దములనుండి విశ్వప్రయ