పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

భారత దేశమున


దేశము ఆంగ్లరాజమకుటముక్రిందికి వచ్చునాటికి కలిగిన మార్పునుగూర్చి 1856 వరకు గవర్నరు జనరలుగనుండిన డాల్ హౌసీ ప్రభువు ఇంగ్లాండు నుండి వ్రాసిన లేఖవలన తెలియగలదు.

1857 డిసెంబరు 2 వ తేదీన డాల్ హౌసీ ఇంగ్లాండునుండి యిట్లు వ్రాసెను. " ... ప్రథమ దినములలో తూర్పుయిండియాకంపెనీవారు ఢిల్లీరాజులు తమప్రభువులుగాను, తాము వారివలన వంగరాష్ట్రపు పన్నుల వసూలు హక్కు పొందిన తాబేదారులుగనే చరించిరి. మొదటి గవర్నరుజనరలైన వార౯ హేస్టింగ్సు ఢిల్లీరాజుతో నేనుగు నెక్కినప్పుడు తానా రాజు వెనుక కూర్చుండెను ! మా నాయనగారి కాలములోకూడ ఆంగ్లేయులు పెద్ద మొగలు ఉద్యోగులను, రాజులను చూడబోయినప్పుడు రొక్కరూపమున నజరులను సమర్పించుచుండిరి. గవర్నరుజనరలు క్రమముగా తనయర్హస్థానమును గ్రహింపసాగెను. ఎట్టకేలకు హేస్టింగ్సు ప్రభువు ఢిల్లీరాజులతో సమానముగ కుర్చీలోకూర్చుండుటవరకు సమాన గౌరవమును పొందెను. 1848 లో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాజును దర్శించుటగాని రాజనగరుకు వెళ్లుటగాని జరుపలేదు. కుశలప్రశ్నముల నుత్తరప్రత్యుత్తర మూలమున సాగించితిని. ఈ గౌరవముల నెల్ల నీ రాజు తదనంతరము తుదముట్టింపనెంచితిని గాని కంపెనీవారు అభ్యంతర పెట్టుటవలన నట్లు చేయలేదు. ఈ డంబముల నెల్లవదలి గవర్నరుజనరలును సమానునిగ గౌర