Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

129

1715 లో జాన్ సర్మన్ అను నాతని నాయకత్వమున పంపబడిన రాయబారము ఆరులక్షల రూపాయిలు ఖర్చుపెట్టి రెండేండ్ల తరువాత చక్రవర్తివలన ఫర్మానా సంపాదింవ గలిగెను. (చూడు: తాంప్సన్ , గెర్రాట్ గార్ల బ్రిటిష్ రూల్)

ఆరోజులలో గవర్నరుజనరలును గవర్నరులునుకూడా చక్రవర్తి యెదుటనిలిచి యుండవలసినదే గాని కూర్చుండుటకు వీలులేదు. వార౯ హేస్టింగ్సు గవర్నరుజనరలుగా నున్నప్పుడు ఢిల్లీ చక్రవర్తి ఏనుగుపైన అంబారిలో కూర్చుండగా నీ వార౯ హేస్టింగ్సు ఆయన వెనుకనే కూర్చుండవలసి వచ్చెను! 1813 లో హేస్టింగ్సు గవర్నరుజనర లగునప్పటి కాంగ్లేయుల పలుకుబడియు బలమును హెచ్చుటవలనను చక్రవర్తి ఇంకను బలహీనుడై మహారాష్ట్రుల చేతిలో నుండుట వలనను చక్రవర్తి హేస్టింగ్సు నొకమారు రమ్మని కోరినప్పుడు, పోవుటకెంతో జాగుచేసి తుదకు చక్రవర్తితో సమానముగా కుర్చీలో కూర్చుండగలిగెను. డాల్ హౌసీ ప్రభువు 1848లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు చక్రవర్తిని దర్శించుటయె తనకు పరువుతక్కువయని మానివేసి చక్రవర్తికిని నవాబులకును చూపవలసిన మర్యాదలను పూర్తిగా తీసివేసెను.

తూర్పు ఇండియా వర్తక కంపెనీవారి నౌకరులును గవర్నరులును మన మొగలాయి చక్రవర్తికి నవాబులకు రాజులకు అడుగులకు మడుగులొత్తు రోజులు పోయి వారే రాజాధి రాజులై మనరాజులచేతనే గౌరవములందు రోజులు వచ్చినవి. తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన అంత మొంది. భారత