84
భారత దేశమున
ములకు భంగము కలిగింపవు. దేశములో రాజవంశములు రావచ్చును; పోవచ్చును. రాజకీయ విప్లవములు పరివర్తనలు కలుగ వచ్చును. హిందూ, పఠాను, మొగలు, మహారాష్ట్ర, సిక్కు, ఆంగ్లేయ ప్రభువు లొకరితరువాత నొకరు వచ్చిరిగాని ఈగ్రామ ప్రజాసంస్థ లెప్పటివలెనే చెక్కు చెదరక నిలిచియున్నవి. నిజముగా నొక్కొక్క చిన్న ప్రభుత్వమని చెప్పదగిన ఈ గ్రామ ప్రజాసమితులే యీ భారతదేశములో కలిగిన మార్పులమధ్య ప్రజాక్షేమమునకు తోడ్పడి వారిని కాపాడిన సంస్థలని చెప్పవచ్చును. ఈసంస్థల మూలముననే భారతీయ ప్రజలు కొంతవరకైన శాంతిని స్వతంత్రమును పొందగలిగినారు."
ఈసంస్థలేమైనవి? ఆంగ్లేయ ప్రభుత్వవిధానమున నివి నాశనమై యదృశ్యమైనవి. సివిలు అధికారము న్యాయవిచారణ దేశపరిపాలనలకు సంబంధించిన అన్ని అధికారములును ఆంగ్లేయ జిల్లా మేజస్ట్రేటుల చేతులలో కారన్ వాలీస్ కేంద్రీకరించినాడు. ఆ యధికారుల చేతులలో నిముడని యధికారములు, అత్యధిక జీతములుగల ఇతరశాఖలకు సంబంధించిన తెల్ల యుద్యోగుల చేతులలో కేంద్రీకరింపబడినవి. లెనోయీ (Lonoye) ఆనాడు (1858 లో) వర్ణించిన జిల్లా పరిస్థితులే నేటికిని అమలు జరుగుచున్నవి. "ఒకజిల్లా సాధారణముగా నింగ్లాండులో యార్కుషైరంత పెద్దదిగానుండును. 20 మొదలు 40 లక్షల ప్రజలుందురు. జిల్లా అధికారి దేశమునకుక్రొత్తవాడు, విజాతీయుడు. అతడు సర్వాంతర్యామిగా నుండుట, దివ్యదృష్టి కలవాడుగా నుండుట దుర్లభము. ప్రజలకష్టసుఖములు వారికి గావలసిన