బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
85
సౌకర్యములు ఇతనికి తెలియవు. తన కచ్చేరీగోడల మధ్య కూర్చుని నివేదికలు తయారుచేసికొనుచు పెద్దకవిలెలను సంక్షిప్తము (ప్రెసిస్ ) గా వ్రాసికొనుచు కాలక్షేపము చేయుచుండును. తాము పరిపాలింపవలసిన ప్రజలను వీ రెరుగనే యెరుగరు. సర్ జేమ్సుకెయిర్డు చెప్పినట్లు ఈ దేశపరిపాలన యొక్క మూలసూత్రము ఎల్లప్పుడు పెద్ద పెద్ద రిటరన్లు రిపోర్టులు తయారుచేయుచు పై యధికారులకు పంపవలసిన బాధ్యతతో పై యుద్యోగుల యధికారమునకు ప్రతివారిని లోబరచియుంచు పద్ధతిగా కనబడుచున్నది. భూస్వాములకు రైతులకు మధ్యగల పరస్పర సంబంధములను ఏనాడును భూస్వాములుగానివారు సూత్రీకరించు సిద్ధాంతములపైన నాధార పరచుటయు నిచ్చట జరుగు విపరీత పద్దతిగా నున్నది."
IV
బ్రిటిష్ వారి న్యాయవిచారణ
ఆంగ్లేయ న్యాయవిచారణాపద్దతి గూఢమైనది. చాల తికమకలతో గుంటచిక్కులతో నిండి న్యాయవాదుల ఇంద్రజాలము సాక్ష్యబలమే ప్రధానముగనుండి, నిరాడంబరమును సులభసాధ్యమును అందరికి తెలియు పూర్వపు పంచాయతీ న్యాయవిచారణా పద్ధతికి భిన్నముగనుండి కూటసాక్ష్యముల సృష్టింపునకు ప్రయివేటు ప్లీడర్ల కుట్రలకు హెచ్చు అవకాశములు గల్పించి న్యాయవిచారణ నొక జూదముగా జేసినది.
ఆంగ్లేయ న్యాయవిచారణా విధానము బీదరైతు