పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

83


మన్రో చెప్పిన మాటలవలన నీ గవర్నరుజనరలుయొక్క పరిపాలనవిధానములో భారతీయసంస్థలనెల్ల కూకటివ్రేళ్ళతో పెల్లగించి ఆంగ్లసంస్థల నెలకొల్పుట యొకముఖ్యవిషయముగా కనపడుచున్నది. ఏవిధమైన అధికారమును పలుకుబడియు 'నేటివు' భారతీయుల చేతులలో నుండకుండా లాగివేసి యాంగ్లేయుల చేతులలో నుంచుట యితని ముఖ్యోద్దేశము. హిందూదేశములో ప్రతి గామములోను ఆ కాలములో నొకవిధమైన మ్యునిసిపాలిటివంటి గ్రామపరిపాలక సంస్థయుండి ఆ గ్రామముయొక్క (రివిన్యూ) శిస్తువసూలు గ్రామరక్షణ (పోలీసు) వ్యవహారము లన్నియ చక్కబెట్టుచుండెను. ప్రైవేటు పబ్లికు విషయములందు గూడ వీనికి మేజస్ట్రేటు న్యాయవిచారణాధికారము లుండెను.

“అన్నిటికన్నను ముఖ్యమైన స్వపరిపాలన సంస్థ గ్రామపంచాయితీయే. ఇది ఆయాగ్రామవాసులలో కొందరు సభ్యులుగాగల ప్రజాసంస్థ. ఆ గ్రామస్థులలో నొండొరులకు వచ్చువివాదలువీనియెదుట మనవిచేసికొని తమవ్యాజ్యములు నివారించుకొందురు. అంతట నా పంచాయితీ యీ వివాదలను పరిష్కరించును” అని సర్ తామస్‌మన్రో వ్రాసియున్నాడు. ఈగ్రామ పరిపాలన సంస్థలనుగూర్చి సర్ చార్లెస్ మెట్కాఫ్‌దొర యిట్లు వ్రాసియున్నాడు:

“ఈగ్రామప్రజాసంఘములు చిన్న (రిపబ్లికులు) ప్రజాస్వామికములు అని చెప్పవచ్చును. వీనికి గావలసిన అధికారము లెల్లకలవు. దేశ ప్రభుత్వసంస్థ లెవ్వియు వీని యధికార