Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

భారత దేశమున


యగు మూర్షిద్ కూలీఖాను సివిలు శాఖలలో అన్ని ముఖ్యోద్యోగములను హిందువులకిచ్చినను చక్రవర్తి హర్షించినది చూడగా అతని కిది యిష్టమేయని తేలగలదు. ఢిల్లీలో రెవిన్యూ శాఖయొక్క కార్యనిర్వహణమెల్ల హిందువుడే చేయుచుండెను. జఫర్‌ఖాను ప్రధానమంత్రిగా నియమింపబడి వారస్వపుతగవులందుకూడ అతడాపదవిలోనున్నను నిజముగా రివిన్యూ పరిపాలన జరిపినది సహాయ దివానగు రఘునాధ క్షత్రియుడే. ఔరంగజేబు చక్రవర్తియైనపిదపగూడ నీయేర్పాటు కొంతకాలము జరిపి తరువాత నీ రఘునాధునికి రాజాబిరుదు నిచ్చి గౌరవించెను. (చూడు. జదునాధసర్కారు-ఔరంగ జేబు III. 727] ఔరంగజేబు అనుమానము కలవాడగుటవలన మొగలు సేనానియగు దిలేర్ఖానునిగూడ బంపినను జస్వంతరావును తరువాత జయసింగును శివాజీతో యుద్ధములందు సేనానులుగ నియమించి వారిపైననే ముఖ్యభారమంతయు వేసి యుండెను.

వంగరాష్ట్ర నవాబులుకూడ హిందువులకు గొప్ప యుద్యోగములనిచ్చిరి. కూలీఖానుదగ్గర దర్ప నారాయణుడు, భూపతిరాయి, కిషోర్ రాయి, జస్వంతరాయి, రఘునందనులు మంత్రులుగా నుండిరి. ఆలీవర్దీఖాను దగ్గఱ ఆనందరాయి సర్వసేనానిగనుండెను. రాజాజానకిరాము డతని ఆంతరంగిక మంత్రి. ఇంకా అనేక ముఖ్యోద్యోగులుండిరి. రాజారామ నారాయణుడు సర్వసేనానియేగాక బీహారు డిప్యూటీ గవర్నరుగ నుండెను. హిందూ సేనానియగు శితాబ్‌రాయి యొక్క