Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

77

భారతదేశమున మహమ్మదీయ పరిపాలన కాలములో ప్రారంభదినములలో కూడ హిందువులు గొప్ప సివిలు ఉద్యోగములు పొందియుండిరి. ముబారక్ ఖిల్జీకాలమున 1317-31 లో ప్రభుత్వములో రివిన్యూలెఖ్ఖలశాఖలో హిందువులెందరో నియమింపబడిరి. (Elphinstone's History) సర్ వంశ పరిపాలనకాలమున 1542 - 54 మధ్య, సైన్యమున హిందువులు పెద్ద యుద్యోగములు పొందిరి. షర్షాయొక్క సేనానులలో ప్రధాని బహ్మజిత్‌గౌరు అను హిందువుడు. మహమ్మదు గజినీ కాలమునకూడ సైన్యమున హిందువులు నియమింపబడిరి.

మహమ్మదు అదిల్‌షా తన పరిపాలనమునెల్ల హెమూ అను హిందూవర్తకునిచేత .జరిపించినాడు. మొగలుచక్రవర్తి యగు అక్బరు, రాజపుత్రులకు గొప్పగొప్పయుద్యోగము లిచ్చినాడు. మానసింగుచేసిన భూములతరముల నిర్ణయము రెవిన్యూ పరిపాలనయు జగత్ప్రసిద్ధమైనవి. అక్బరుకాలమున సైన్యములోను భూమి నర్వే రివిన్యూ వ్యవహారములలోను అన్ని సివిలు శాఖలందును హిందువులు నియమింపబడిరి. మొగలు చక్రవర్తులకు ఆఫ్‌గన్ యుద్ధములలో మొగలు సేనానులుండినను తోడర్‌మల్లువంటి హిందూసేనాసులను గూడ నియమించిరి. పాజహాను కొమారుల తగవులాటలలో జస్వంతరావు అను రాజపుత్ర వీరుడే సర్వసేనానిగా నియమింపబడి విశ్వాసపాత్రుడైనాడు,

ఔరంగజేబు చక్రవర్తి (1659-1707) రాజ ప్రతినిధి