పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

79


శౌర్యము నాంగ్లేయులుకూడ ప్రశంసించియున్నారు. మీర్జాఫర్‌తోపాటు దుర్లభరాముడను హిందువుడు సురాజుద్దౌలా క్రింద నేనానిగ నుండెను.

వంగరాష్ట్రములోని “బారాబున్యా" లనబడు పండ్రెండుమంది మండలాధిపతులు రాజప్రతినిధికి పేరునకు కప్పము గట్టుచుండిరి. వీరికి గొప్ప సేనలు నావికదళము లుండెను. మగ్గులు ఆరఖానీను సముద్ర చోరులను దండించుటకు వీరు నౌకా బలముల నుపయోగించుచుండిరి. నేటికిని వంగరాష్ట్రమున కొందరికిగల "మీర్ బహర్ " లనబడు బిరుదనామము నౌకాధీశు లగుటను తెలుపుచున్నది. ఇట్లు మహమ్మదీయులతోపాటు హిందువులు సైనిక సివిలుపరిపాలనమునం దధికారము గల్గియుండిరి.

బ్రిటిషువారు రాజ్యాక్రమణ చేసిన ప్రథమ దినములలో పూర్వపు మొగలు ఉద్యోగుల ద్వారానే పని జరుగనిచ్చిరి. కంపెనీవారు మద్రాసు రాజధానిలోను వంగ రాష్ట్రమునను భారతీయులకు సైన్యమున ఉద్యోగములిచ్చుచుండిరి. ఆంగ్లేయ సైనికులు వీరిక్రింద అడకువతో పనిచేయుచుండిరి. బ్రిటిషువారికి పలుకుబడిహెచ్చి రాజ్యాధిపత్యము వర్ధిల్లగానే నల్లవారిక్రింద తెల్లవారు పనిచేయ పరువుతక్కువగా నెంచి సేనలో నల్లవారి కుద్యోగము లిచ్చుట మాసిరి. ఉన్న నల్లఉద్యోగులకు తెల్లసైనికులు సలాములుజేయుట మానిరి. కారన్ వాలీను గవర్నరు జనరలగునప్పటి కీ అహంభావము పూర్తిగా పెరిగి నల్లవారికి పెద్దయుద్యోగము లెవ్వియు ఒసగకూడ