పుట:బేతాళపంచవింశతి.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్సుందరి నిజప్రతాపరు
చిం దనరు నభంబున రవిచెందిరభంగిన్.

27


క.

ఆ మనుజేశ్వరు కులసతి
సోమప్రభల ఫనవిత సోమప్రభయు
ద్దామమతి వారికొడుకు ర
మామహితుఁడు గలఁడు వజ్రమకుటుం డనఁగన్.

28


క.

కందర్పయాదవేంద్రుల
సౌందర్యము చెప్ప నతని సౌందర్యముచేఁ
బొండువడు ననుచు ధరఁ జె
ప్పందగి యలరూపమహిమఁ బరగు నతండున్.

29


క.

ఆరాజకుమారునకు ను
దారుఁడు సఖుఁ డయ్యె మంత్రితనయుఁడు గలఁడే
పారఁగ సమ్మతి బుద్ధిశ
రీరుండను నతఁడు గరము ప్రియకరుఁ డగుచున్.

30


వ.

ఆ రాజపుత్త్రుం డొక్కనాఁడు మంత్రిపుత్త్రుం దోడ్కొని మృగయావినో
దార్థం బరిగి శార్దూలసింహశరభకురంగభల్లూకవరాహవనలు
లాయకులంబైన యరణ్యంబుఁ జొచ్చి వారుక్రేంకారవంబు సహింపం
జాలక తమపైఁ బఱతెంచు వాలుమృగంబులం జంపి పుష్పలతావేల్లి
తంబైన వనమధ్యంబు జొచ్చి దాని కనతిదూరంబునం బరిస్ఫుటోజ్జ్వల
ప్రభాభాసితంబైన వనదేవతావిభ్రమదర్పణంబునుంబోలె నొప్పు సరోవ